OTT ప్రియులూ గెట్ రెడీ.. ఈ వారం అలరించేందుకు రాబోతున్న చిత్రాలివే!

దసరా పండగకు పెద్ద ఎత్తున కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే ఓటీటీ వేదికగా కూడా చాలానే చిత్రాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిని చూస్తూ పుల్లుగా ఎంజాయ్ చేసిన సినీ ప్రేక్షకులకు ఇక ఆ తర్వాత నుంచి అంత ఆసక్తిగా చూసే చిత్రాలేవీ రాలేవు. ముఖ్యంగా దివాళికి డబ్బింగ్ చిత్రాలు, కొన్ని వెబ్ సిరీస్ లు మాత్రవే వచ్చాయి. కానీ ఈ వారం మాత్రం అదిరిపోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. థియేటర్లలో అద్భుతమైన థ్రిల్లర్ మూవీస్ రిలీజ్ కాబోతుండగా.. ఓటీటీ వేదికగా అంతకు మించిన సినిమాలు, సిరీస్ లో రాబోతున్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈవారం నవబంర్ 17వ తేదీన పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వస్తున్న మంగళవారం సినిమా విడుదల కాబోతుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లోరాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. అలాగే హీరోయిన్ హన్సిక తాజాగా కథానాయికగా నటించిన మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమా కూడా నవంబర్ 17వ తేదీనే విడుదల కాబోతుంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఒకరోజు విడుదల కాబోతున్న ఈ సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించనున్నాయో.

This week OTT Releases: Siddharth Chinna, Kannur Quad Movies And Web Series List November 3rd week 2023

విక్రాంత్ హీరోగా.. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా తెరకెక్కిన తాజా చిత్రం స్పార్క్ లైఫ్. హీరోగా నటిస్తూనే స్వయంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా కూడా నవంబర్ 17వ తేదీనే విడుదల కాబోతుంది. అలాగే సప్త సాగరాలు దాటి సినిమాకు సీక్వెల్ గా తీసిన పార్ట్ 2 చిత్రం కూడా ఈ వారమే విడుదల కాబోతుంది. రక్షిత్ శెట్టి హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన "సప్త సాగరాలు దాటి సైడ్ బి" నవంబర్ 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. వీటితో పాటు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రాబోతున్న అడవిలో అన్వేషి చిత్రం కూడా శుక్రవారం అంటే నవంబర్ 17వ తేదీనే విడుదల కాబోతుంది.

ఇక ఓటీటీ వేదికగా కూడా అద్భుతమైన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 17వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా ట్విన్ లవ్ అనే హాలీవుడ్ చిత్రం రాబోతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అపూర్వ అనే హిందీ చిత్రం నవంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుండగా.. హీరో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో వచ్చి చిన్నా అనే చిత్రం నవంబర్ 17వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే నవంబర్ 17వ తేదీ నుంచి కన్నూర్ స్క్వాడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. బుక్ మై షోలో రాంగ్ ప్లేస్ నవంబర్ 12వ తేదీ నుంచి, ది ఎగ్జార్సిస్ట్ నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

This week OTT Releases: Siddharth Chinna, Kannur Quad Movies And Web Series List November 3rd week 2023

నెట్ ఫ్లిక్స్ వేదికగా... హౌటూ బికమ్ ఏ మాబ్ బాస్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతుంది. బెస్ట్ క్రమిస్మస్ ఎవర్ అనే సినిమా నవంబర్ 16వ తేదీన రాబోతుంది. ది క్రౌన్ అనే వేబ్ సిరీస్ కూడా అదే రోజున స్ట్రీమింగ్ కాబోతుంది. బిలీవర్ 2 అనే కొరియన్ సినిమా, ది డాడ్స్ అనే హాలీవుడ్ చిత్రం, సుఖీ అనే హిందీ సినిమాలు నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతాయి. అలాగే ది రైల్వేమెన్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 18వ తేదీ నుంచి రాబోతుంది. ది ఫ్లాష్ అనే తెలుగు సినిమా జియో సినిమాలో నవంబర్ 15వ తేదీన విడుదల అవుతుంది. అలాగే ఆపిల్ టీవీ ప్లస్ లో మోనార్క్ అనే హాలీవుడ్ చిత్రం శుక్రవారం రిలీజ్ అవుతుంది. మీకు నచ్చిన ఈ చిత్రాలను ఓటీటీ వేదికగా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X