OTT ప్రియులకు హోలీ స్పెషల్ సర్‌ప్రైజ్.. ట్రూ లవర్ సహా అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి!
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ఎక్కువ మంది థియేటర్లలో కంటే కూడా ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం హోలీ పండుగ సందర్భంగా మరిన్ని స్పెషల్ చిత్రాలు, బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీల్లో కొత్త కొత్త చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ వారం ఏకంగా 15 అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా రాబోతున్నాయి. ఆ చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా చేసిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆడుజీవితం సినిమా మార్చి 28వ రిలీజ్ కాబోతుంది. తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయబోతుంది. అలాగే వార్నర్ బ్దర్స్ అనే సినిమా కూడా మార్చి 29న రాబోతుంది. ఈ సినిమాను చూసేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
టెస్టామెంట్ (వెబ్ సిరీస్) - మార్చి 27
హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29
ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29
ది గ్రేడ్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ట్రూ లవర్ - మార్చి 27
పట్నా శుక్లా (హిందీ) - మార్చి 29
మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29
రెనెగడె నెల్లె (వెబ్ సిరీస్) - మార్చి 29
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
టిగ్ నొటారో (వెబ్ సిరీస్) - మార్చి 26
ది బాక్స్ టర్స్ (వెబ్ సిరీస్) - మార్చి 28
ఇన్ స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) - మార్చి 29
ఆహా వేదికగా..:
సుందరం మాస్టర్ - మార్చి 28

ఈటీవీ విన్ వేదికగా..:
ఏం చేస్తున్నావ్ - మార్చి 28
బుక్ మై షో వేదికగా..:
ది హోల్డోవర్స్ (హాలీవుడ్ ) - మార్చి 29
జియో వేదికగా..:
ఎ జెంటిల్ మ్యాన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) - మార్చి 29


Click it and Unblock the Notifications











