OTT ప్రియులూ గెట్ రెడీ.. ఈ వారం నవ్వించి, భయపెట్టి, కన్నీరు పెట్టించే చిత్రాలు అందుబాటులోకి!
ఈ మధ్య కాలంలో థియేటర్లలోలకి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకంటే ఇంట్లోనే కూర్చొని ఓటీటీల వేదికగా సినిమాలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడకు వరకూ వెళ్లి ఒక్కరు చూడడం కంటే కూడా ఇంట్లోనే కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఓటీటీలు అంటే విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఎప్పుడెప్పుడు కొత్త కొత్త చిత్రాలు వస్తాయా అని కూడా చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే తాజాగా ఈ వారం థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలతో పాటు ఓటీటీ వేదికగా రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లల లిస్ట్ బయటకు వచ్చింది. అయితే నవ్వించడంతో పాటు ఏడిపించి, భయపెట్టి, థ్రిల్ కు గురి చేసే చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా రాబోతున్న యానిమల్ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అలాగే సుడిగాల్ సుధీర్ హీరోగా, డాలీషా హీరోయిన్ గా అరుణఅ విక్కిరాల తెరకెక్కించిన కాలింగ్ సహస్ర చిత్రం కూడా ఈ వారమే విడుదల కాబోతుంది. ఈ శుక్రవారం అంటే డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ అవుతుంది. అలాగే కార్తిక్ రాజు కథానాయకుడిగా సిమ్రాన్ చౌదరి, ఐరా లు కథానాయికలుగా రాబోతున్న అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ అథర్వ కూడా డిసెంబర్ ఒకటో తేదీన రాబోతుంది.

డిసెంబర్ ఒకటో తేదీన కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ హీరోహీరోయిన్లుగా ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో వస్తున్న ఉపేంద్ర గాడి అడ్డా చిత్రం విడుదల కాబోతుంది. అాగే విక్రమ్ రాథోడ్ చిత్రం కూడా డిసెంబర్ ఒకటో తేదీనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది. ఈ అద్భుతమైన చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులుకూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించి.. బాక్సాఫీసు వద్ద ఏ మేర కలెక్షన్లు సాధిస్తాయనేది.
ఇక ఓటీటీల వేదికగా విడుదల కాబోయే చిత్రాలు కూడా చాలనే ఉన్నాయి. అక్కినేని నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్ దూత కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమెజాన్ ప్రైమే వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అదే రోజు క్యాండీ కేన్ లేన్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో... డిసెంబర్ 30వ తేదీన అనేక చిత్రాలు విడుదల అవుతున్నాయి. బుజ్జిగాడు, ఖుషి, ఈ రోజుల్లో, బంగారు బుల్లోడు, ఐతే అనే తెలుగు సినిమాలు వస్తున్నాయి. ఓబ్లిటిరేటెట్, ఫ్యామిలీ స్పీచ్, ది బ్యాడ్ గాయ్స్: ఎ వెరీ బ్యాడ్ హీలీడే అనే ఇంగ్లిష్ చిత్రాలు కూడా అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగానే డిసెంబర్ ఒకటో తేదీన.. మిషన్ రాణిగంజ్ అనే హిందీ, స్వీట్ హోం: సీజన్ 1 అనే కొరియన్, ది ఈక్వలైజర్ అనే ఇంగ్లీష్, క్యాటరింగ్ క్రిస్మస్ అనే ఇంగ్లీష్ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. అలాగే డస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఇన్ సైడ్ ఎన్ఎస్జీ అనే డాక్యుమెంటరీ ఈరోజుటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగు, తమిళ్ లో చిన్నా నవంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ అనే ఇంగ్లీష్, మాన్ స్టర్ ఇన్ సైడ్ అనే ఇంగ్లీష్ సినిమాలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీలివ్ లో మార్టిన్ లూథర్ కింగ్ అనే నవంబర్ 29వ తేదీ నుంచి, డిసెంబర్ 2వ తేదీ నుంచి 800 అనే తమిళ చిత్రం జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











