OTT ప్రియులకు అలర్ట్.. ఈ వారం అంతా ఆ చిత్రాలదే హవా.. మీరు చూడాల్సినవి మాత్రం ఇవే!
ఈ మధ్య కాలంలో అద్భుతమైన టాక్ వస్తే తప్ప చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం లేదు. హిట్ టాక్ వచ్చి.. అందులోనూ సినిమా చాలా బాగుందని తెలిసిన వాళ్లు చెప్తేనే.. థియేటర్లకు వెళ్తున్నారు. లేదంటే ఇంట్లోనే కూర్చొని ఓటీటీల వేధికగా తమకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ వారం విడుదల కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్టు చూసుకొని మరీ తమకు నచ్చిన వాటిని చూసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే.. ఈ స్పెషల్ స్టోరీ. ఈ కథనంలో ఈ వారం థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టు చూసేద్దాం.
ఈ వారం థియేటర్లలో ఎక్కువగా పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు. చిన్న చిత్రాల హవానే ఎక్కువగా కొనసాగబోతుంది. అయితే అందరినీ ఫుల్లుగా భయపెడుతున్న పిండం అనే అద్భుతమైన సినిమా డిసెంబర్ మూడో వారమే రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతుంది. అలాగే బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రలో రాబోతున్న కలశ అనే సినిమా కూడా డిసెంబర్ 15వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటుగానే విరాజ్ అశ్విని హీరోగా వస్తున్న జోరుగా హుషారుగా కూడా డిసెంబర్ 15వ తేదీనే రిలీజ్ అవుతుంది.

అంతేకాకుండా కవల పిల్లలు హరికృష్ణ, రామకృష్ణలు హీరోలుగా.. యాని, రేఖలు హీరోయిన్లుగా రాబోతున్న తికమక తాండ అనే సినిమా కూడా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చే.. లాంగ్ లైవ్ అని సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. డిసెంబర్ 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ఓటీటీ వేధికగా విడుదల కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కూసే మునిసామి వీరప్పన్ అనే సినిమా డిసెంబర్ 14వ తేదీ నుంచి జీ5 వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో జపాన్ తమిళ సినిమా డిసెంబర్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. డిసెంబర్ 12 నుంచి సింగిల్స్ ఇన్ ఫెర్నో, 14 నుంచి ది క్రౌన్, 15వ తేదీ నుంచి యెల్లో అనే వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే షో కూడా డిసెంబర్ 15వ తేదీ నుంచి అందుబాటులో ఉండబోతుంది. ఇక ఆపిల్ టీవీ ప్లస్ లో డిసెంబర్ 15వ తేదీ నుంచి ది ఫ్యామిలీ ప్లాన్ అందుబాటులోకి రాబోతుంది.

బుక్ మై షోలో.. డిసెంబర్ 12వ తేదీ నుంచి ది పర్షియన్ వెర్షన్, డిసెంబర్ 13వ తేదీ నుంచి టేలర్ స్విఫ్ట్, డిసెంబర్ 15వ తేదీ నుంచి వింటర్ టైడ్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇక లయన్స్ గేట్ ప్లేలో డిటెక్టివ్ నైట్ హాలీవుడ్ సినిమా కూడా డిసెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. జియో సినిమాలో ది బ్లాకెనింగ్ అనే హాలీవుడ్ చిత్రం కూడా డిసెంబర్ 16వ తేదీ నుంచి విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











