OTTలో సినీ జాతర.. ఏకంగా 20 సినిమాలు.. ఆసక్తి కలిగించే చిత్రాలివే!
మండే వచ్చేసింది... అటు ఓటీటీ సినిమాల లిస్టూ వచ్చేసింది.. ఈ వారం కూడా మూవీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలో (This Week Theatrical Releases) చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఇటు ఓటీటీలోనూ 20కి (This week OTT Movies)పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. దీనితో సెప్టెంబర్ నాలుగో వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ ఏ సినిమాలు రాబోతున్నాయి... అందులో ఏవి ఆసక్తి కలిగించేవి... అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవ్వనున్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ వారం థియేటర్లలో నాలుగు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు అన్ని సెప్టెంబర్ చివరి వారానికి షిఫ్ట్ అవ్వడంతో... ఈ వారం చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కు వచ్చేశాయి. అందులో సప్త సాగారాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ వంటి సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇక ఈ సినిమాల్లో ఆసక్తి కలిగించే చిత్రం సప్త సాగారాలుదాటి. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ఏ. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో సప్త సాగారాలు దాటి అనే పేరుతో రాబోతుంది. సెప్టెంబరు 1న కన్నడనాట విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ అక్కడ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో ఈ నెల 22న మన దగ్గర థియేటర్లోకి రానుంది.
ఇక ఓటీటీ చిత్రాల విషయానికి వస్తే... 20 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఇందులో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం కింగ్ ఆఫ్ కోత ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వెబ్ సీరిస్ లో వేణు తోట్టెం పూడి నటిస్తున్న అతిథి. ఇప్పుడు ఈ వెబ్ సీరిస్ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా సెప్టెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా హారర్ నేపథ్యంలో సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కరీనా కపూర్ ఖాన్, జైదీప్, విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ జానే జాన్. ఈ చిత్రం కూడా ఆసక్తి కలిగిస్తోంది.
నెట్ ఫిక్స్
1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ - సెప్టెంబరు 19న స్ట్రీమింగ్
2. లవ్ ఎగైన్ - సెప్టెంబరు 20న స్ట్రీమింగ్
3. జానే జాన్- సెప్టెంబరు 21న స్ట్రీమింగ్
4. కెంగన్ అసుర సీజన్ 2 - సెప్టెంబరు 21న స్ట్రీమింగ్
5. సిజర్ సెవన్ సీజన్ 4 - సెప్టెంబరు 21న స్ట్రీమింగ్
6. సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 - సెప్టెంబరు 21న స్ట్రీమింగ్
7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
9. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
హాట్‌స్టార్
11. అతిథి - సెప్టెంబరు 19న స్ట్రీమింగ్
12. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20న స్ట్రీమింగ్
13. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
14. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
15. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23న స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్
16. కసండ్రో - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్
జియో సినిమా
18. ఫాస్ట్ X - సెప్టెంబరు 18న స్ట్రీమింగ్
బుక్ మై షో
19. మెగ్ 2: ద ట్రెంచ్ - సెప్టెంబరు 18న స్ట్రీమింగ్
ఆపిల్ ప్లస్ టీవీ
20. స్టిల్ అప్ - సెప్టెంబరు 22న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











