OTTలో సినీ జాతర.. ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు అందుబాటులోకి!

ఈ మధ్య కాలంలో చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే కూడా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో ఓటీటీలోనే సినిమాలు చూసేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు అయితేనే ఎక్కువ మంది థియేటర్లకు వెళ్తున్నారు. అందులోనూ పాజిటివ్ టాక్ వస్తేనే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ వారం ఇటు ఓటీటీలోనూ, అటు థియేటర్లలోనూ అద్భుతమైన చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అయితే ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో, థియేటర్ల వద్ద సందడిచేయబోయే పెద్ద చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే పెద్ద చిత్రాల్లో ముందు ఉండేది సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతుంది. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అంతా ఈ చిత్రాన్ని చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాల, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. శ్రుతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. అలాగే జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ లు విలన్లుగా నటించబోతున్నారు.

This week OTT, Theatrical Releases: Salaar, Dunki, Aquamen Other Movies Released List of December Fourth Week 2023

అలాగే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా.. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో డంకీ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీనే విడుదల కాబోతుంది. సలార్ కు ఒక్కరోజు ముందు రాబోతున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్, రాజ్ కుమార్ హిరాణి ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా అక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్ అనే సినిమా కూడా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పార్ట్ 1లో లాగానే జాసన్ మోమోవా కథా నాయకుడిగా జేమ్స్ వాన్ దర్శకత్వంలోనే రాబోతుంది.

This week OTT, Theatrical Releases: Salaar, Dunki, Aquamen Other Movies Released List of December Fourth Week 2023

ఇక ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలివే..

నెట్ ఫ్లిక్స్ వేధికగా.. ది రోప్ కర్స్ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మేస్ట్రో అనే హాలీవుడ్ సినిమా డిసెంబర్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. ఆదికేశవ కూడా డిసెంబర్ 22వ తేదీన ఓటీటీ వేధికగా విడుదల కాబోతుంది. ఆరోజే... టాప్ గన్: మావెరిక్, కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ, రెబల్ మూన్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వేధికగా.. డిసెంబర్ 22వ తేదీన డ్రై డే అనే హిందీ సినిమా, సప్తసాగర దాచే ఎల్లో సైడ్ బీ కూడా రిలీజ్ కాబోతున్నాయి.

This week OTT, Theatrical Releases: Salaar, Dunki, Aquamen Other Movies Released List of December Fourth Week 2023

జియో సినిమాలో ది సావనీర్ అనే హాలీవుడ్ చిత్రం డిసెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హే కామని అనే హిందీ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతుంది. ఇక లయన్స్ గేట్ ప్లేలో ఫియర్ ద నైట్ అనే హాలీవుడ్ చిత్రం డిసెంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే బుక్ మై షోలో ది మిరాకిల్ అనే హాలీవుడ్ సినిమా డిసెంబర్ 19వ రిలీజ్ కాబోతుంది. ఈ అద్భుతమైన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X