OTTలో సినీ జాతర.. ఏకంగా 18 సినిమాలు... వీటిలో ఆసక్తి కలిగించే చిత్రాలివే!
సినిమా ప్రియులకు ఈ వారం (This Week OTT Movies) కూడా పండగే. థియేటర్ లో రెండు చిత్రాలు రిలీజ్ అవతుండగా... ఓటీటీలో మాత్రం ఏకంగా 18 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఏ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.. అండ్ ఏ వెబ్ సిరీస్ లు చూడొచ్చు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లో రిలీజ్ అయ్యే చిత్రాలివే....:ప్రస్తుతం థియేటర్లో రౌడి హీరో విజయ్ దేవరకొండ ఖుషి సందడి చేస్తోంది. ఇక ఈ వారం రెండు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అందులో అందరి దృష్టి షారుఖ్ నటిస్తున్న జవాన్ మీదే ఉంది. ఇక ఈ మూవీ... ఈవారం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తెలుగు బాక్సాఫీస్ వద్ద నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు విషయానికి వస్తే.. ఈవారం మొస్తం అందరి ఫొకస్ జైలర్ సినిమాపైనే ఉంది. ఇక ఈ సినిమా సూపర్ రజినీ కాంత్ కు మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత ఆసక్తి కలిగించే సినిమాల విషయానికి వస్తే.. మార్వెల్ సీరిస్ నుంచి వస్తున్న ఐ యామ్ గ్రూట్, కుంఫు పాండా చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో:
1. వన్ షాట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5న విడుదల
2. లక్కీ గౌ (హిందీ చిత్రం)-సెప్టెంబర్ 6న విడుదల
3. రజనీకాంత్ జైలర్ మూవీ- సెప్టెంబర్ 7న విడుదల
4. సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 8న విడుదల
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ:
1.షేన్ గిల్లీస్ (హాలీవుడ్)- సెప్టెంబర్ 5 న విడుదల
2. స్కాట్స్ హానర్ (హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 5న విడుదల
3. కుంగ్‍ఫూ పాండా (వెబ్ సిరీస్-సీజన్ 3)- సెప్టెంబర్ 7న విడుదల
4. టాప్ బాయ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 7న విడుదల
5.సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 8న విడుదల
6. వర్జిన్ రివర్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 7న విడుదల

డిస్నీ ప్లస్ హాట్‍స్టార్:
1. ఐయామ్ గ్రూట్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 6న విడుదల
2. ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 6న విడుదల
జీ5:
1. హడ్డీ - సెప్టెంబర్ 7న విడుదల
ఆహా:
1. లవ్ (తమిళ చిత్రం)- సెప్టెంబర్ 8న విడుదల
బుక్ మై షో:
1.లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8న విడుదల
లయన్స్ గేట్ ప్లే:
1. ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8న విడుదల
ఆపిల్ టీవీ ప్లస్:
1. ది ఛేంజ్‌లింగ్ (హాలీవుడ్) - సెప్టెంబర్ 8న విడుదల
హైరిచ్:
1. ఉరు(మలయాళం) - సెప్టెంబర్ 4న విడుదల


Click it and Unblock the Notifications











