OTT Movies List: థియేటర్లోకి ఖుషి.. ఓటీటీలోకి ఏకంగా 22 సినిమాలు.. వీటిలో ఆసక్తి కలగించే చిత్రాలివే!

సినిమా ప్రియులకు ఈ వారం కూడా పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే... థియేటర్ లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత మూవీ ఖుషి రిలీజ్ కాబోతుంది. దీనితో పాటు.. ఓటీటీ వేదికగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే ఇందులో ఏ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.. అండ్ ఏ వెబ్ సిరీస్ లు చూడొచ్చు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓటీటీ వచ్చాకా... సినిమా లవర్స్ కు వారం వారం పండగే అని చెప్పవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని... సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడొచ్చు. ఇక ఈ వారం కూడా ఓ థియేటర్ మూవీతో పాటు.. ఓటీటీ వేదికగా 22 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇందులో తెలుగు స్ట్రేయిట్ సినిమాలు అయితే లేవు. అన్ని డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. ఇక వాటిలో డీడీ రిటర్న్స్ కామెడీ మూవీ ఆసక్తి కలిగిస్తుండగా... మరొకటి స్కామ్ 2003 వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

Vijay Sam Kushi Movie And List Of OTT Movies Web Series Released On August 5th Week 2023

ఇక థియేటర్ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ మూవీ విజయ్ దేవరకొండ, సమంత ఖుషి. ఇక ఈ సినిమాను మజిలీ, నిన్నుకోరి, టక్ జగదీశ్ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి మలయాళ దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా.. ఇప్పటికే పాటలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ఈవారమే సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై అటు విజయ్ దేవరకొండ, ఇటు సమంత భారీ ఆశలు పెట్టుకున్నారు.

Vijay Sam Kushi Movie And List Of OTT Movies Web Series Released On August 5th Week 2023

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

అమెజాన్ ప్రైమ్:

1. ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న రిలీజ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1. ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 29న రిలీజ్

2. NCT 127: ద లాస్ట్ బాయ్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 30న రిలీజ్

3. ద ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 01న రిలీజ్

నెట్‌ఫ్లిక్స్:

1. లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 30న రిలీజ్

2. మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 30న రిలీజ్

3. చూజ్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 31న రిలీజ్

4. వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 31న రిలీజ్

5. ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) - సెప్టెంబరు 01న రిలీజ్

6. డిసెన్‌చాంట్‌మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న రిలీజ్

7. హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) - సెప్టెంబరు 01న రిలీజ్

8. లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న రిలీజ్

9. ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 01న రిలీజ్

10. ఈజ్ షీ ద ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 03న రిలీజ్

Vijay Sam Kushi Movie And List Of OTT Movies Web Series Released On August 5th Week 2023

జీ5:

1. బియే బిబ్రాత్ (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 01న రిలీజ్

2. డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 01న రిలీజ్

సోనీ లివ్

1. స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల

హెచ్ఆర్ ఓటీటీ:

1. నీరజ - మలయాళ సినిమా - ఆగస్ట్ 28న రిలీజ్

2. లవ్ ఫుల్లీ యువర్స్ వేదా - మలయాళ సినిమా - ఆగస్ట్ 29న రిలీజ్

3. నానుమ్ పిన్నోరు నానుమ్ - మలయాళ సినిమా - ఆగస్ట్ 30న రిలీజ్

4. వివాహ ఆహ్వానం - మలయాళ సినిమా - సెప్టెంబర్ 02న రిలీజ్

బుక్ మై షో..

1. ద అల్లేస్ - అరబిక్ సినిమా - సెప్టెంబర్ 1న రిలీజ్

ఇలా ఈ వారం ఓటీటీ వేదికల్లో మొత్తంగా 22 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవ్వనున్నాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదీన 11 చిత్రాలు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఫ్రైడే నైట్ ప్లాన్, ఇండియానా జోన్స్ 5, డీడీ రిటర్న్స్, స్కామ్ 2023 ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X