OTT లవర్స్ గెట్ రెడీ.. ఏకంగా 30 సినిమాలు... కచ్చితంగా చూడాల్సిన చిత్రాలివే!
ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. గత వారం జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు థియేటర్లలో విడుదల కాగా... ఈ వారం మాత్రం తమిళ డబ్బింగ్ సినిమాతో పాటు.. చిన్న చిత్రాలు థియేటర్లోకి రానున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని ఆసక్తికర మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇక అందులో విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోనీ తప్ప మరే ఏ సినిమాపై అంచనాలు లేవు. సోదర సోదరీ మణులారా, రామన్న యూత్, చాంగురే బంగారు రాజా వంటి చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇక ఇప్పటికే జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో థియేటర్లలో ఉండగా.. వీటికి పోటీగా ఈ వారం పెద్ద సినిమాలేవి లేనట్లు తెలుస్తోంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే... ఈ వారం ఎంటర్‌టైన్మెంట్ డోస్ కాస్త పెరగనుందని తెలుస్తోంది. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీల్లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
అలాగే చాన్నాళ్ల పాటు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోని గోపీచంద్ రామబాణం, అర్జున్ దాస్ అనీతి, పాయల్ రాజ్ పుత్ మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే కాలా, బంబై మేరీజాన్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు కూడా ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయో ఫుల్ లిస్ట్ మీకోసం..

నెట్‌ఫ్లిక్స్:
1. వైఫ్ లైక్ (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 11న స్ట్రీమింగ్
2. క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
3. రెజ్లర్స్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
4. వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ సినిమా) - సెప్టెంబరు 14న స్ట్రీమింగ్
5. రామబాణం (తెలుగు) - సెప్టెంబరు 14న స్ట్రీమింగ్
6. భోళా శంకర్ (తెలుగు) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
7. ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
8. మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
9. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
10. ఎల్ కొండే (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
11. సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:
1. కెల్సీ (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 12న స్ట్రీమింగ్
2. ద కిడ్నాపింగ్ డే (కొరియన్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
3. బంబై మేరీ జాన్ (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 14న స్ట్రీమింగ్
4. ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
5. వైల్డర్‌నెస్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
6. అనీతి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
1. ఎలిమెంటల్ (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
2. ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
3. హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
4. వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 13న స్ట్రీమింగ్
5. కాలా (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
6. ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
7. ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లిష్ సినిమా) -సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

ఆహా:
1. మాయపేటిక (తెలుగు ) - సెప్టెంబరు 15
సోనీ లివ్:
1. జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
ఈటీవీ విన్:
1. దిల్ సే (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబరు 16న స్ట్రీమింగ్
బుక్ మై షో:
1. బార్బీ (ఇంగ్లిష్ చిత్రం) - సెప్టెంబరు 12న స్ట్రీమింగ్
2. ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లిష్ సినిమా ) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
సైనా ప్లే:
1. పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 14న స్ట్రీమింగ్


Click it and Unblock the Notifications











