OTT Telugu New Releases : ఓటీటీలో దుమ్ములేపుతున్న చిత్రాలు.. కోర్టు, షన్ముఖ, టుక్ టుక్.. ఇక్కడ చూసేయండి

ఓటీటీ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. థియేటర్లలో సినిమాను వీక్షించినా ఓటీటీలో మళ్లీ చూసేందుకు వేచి ఉంటున్నారు. మరోవైపు తెలుగు, తమిళం, మలయాళం నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రతి వారం ఓటీటీలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో దుమ్ములేపున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ఏ వేదికన చూడాలో తెలుసుకొని చూసేయండి.

కోర్టు : స్టేట్ వర్సెస్ ఏ నోబడీ (Court : A State Vs Nobody)..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కోర్టు : స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. లీగల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. బిగ్ బాస్ శివాజీ ఈ చిత్రంలో మంగపతిగా నటించి విశేషంగా ప్రశంసలు పొందారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి నూతన నటీనటులగా పరిచయం అయ్యారు.

This Week Released Ott Telugu movies List

ఆది సాయికుమార్ షన్ముఖ (Shanmukha)..
సీనియర్ నటుడు ఆది సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం 'షన్ముఖ'. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ సినిమా గత నెల మార్చి 21 థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరిగా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియోస్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

టుక్ టుక్ (Tuk Tuk)..
కోర్టు సినిమా ఫేమ్ హర్ష్ రోషన్ నటించిన మరో చిత్రం 'టుక్ టుక్'. ఈ చిత్రానికి సుప్రీత్ సీ క్రిష్ణ దర్శకత్వం వహించారు. ఫాంటసీ కామోడీ జోనర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఆడియెన్స్ నుంచి కాస్తా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 10 నుంచే ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.

కింగ్ స్టన్ (Kingston)..
కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ నటించిన తాజా చిత్రం కింగ్ స్టన్. హారర్ర్ థ్రిల్లర్ గా మార్చి 7న థియేర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 13న ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

పెరుసు (Perusu)..
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోదాండరాం రెడ్డి తనయకుడు వైభవ్ రెడ్డి తాజాగా నటించిన చిత్రం 'పెరుసు. ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ మార్చి 14న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X