This Week Theatre and OTT Movies : హిట్3, రెట్రో సహా 8 చిత్రాలు.. ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే4 వరకు థియేటర్లలోకి స్టార్ హీరోల చిత్రాలు వస్తుండటం విశేషం. నేచురల్ స్టార్ నాని, తమిళ అగ్ర హీరో సూర్య, తదితరులు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు ఓటీటీలోనూ నిజ జీవిత చిత్రాలు, యాక్షన్, రొమాంటిక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్బంగా ఏఏ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.. ఏఏ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుందనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా థియేటర్లలోకి రాబోయే చిత్రాల విషయానికొస్తే..
హిట్ 3 (Hit : The Third Case)..
నేచురల్ స్టార్ నాని - శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'హిట్ : ది థర్డ్ కేస్'. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ కేస్ కు సంబంధించిన చిత్రాలు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 1న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాట్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

రెట్రో (Retro)..
తమిళ స్టార్ హీరో సూర్య చిత్రాలకు తెలుగులోనూ ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. సూర్య - పూజా హెగ్దే జంటగా నటించిన తాజా చిత్రం 'రెట్రో' కూడా మే1నే గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి రజనీకాంత్ 'పేట' మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం విశేషం.
టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)..
స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఎం శశికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే1నే విడుదల కాబోతోంది.
ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు..
రాబిన్ హుడ్ (Robinhood)..
నితిన్ - శ్రీలీలా జంటగా నటించిన రీసెంట్ ఫిల్మ్ 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మొదటి సారిగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మే2న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జీ5లో చూడవచ్చు.
కోస్టావో (Costao)..
కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ డ్రామా రూపుదిద్దుకుంది. 1990లో గోవాలో అతిపెద్ద డ్రగ్ మాఫియాను ఎదుర్కొనేందుకు ఏకంగా సిస్టమ్ కే ఎదురెళ్లిన ఆయన నిజ జీవిత సాహసమే ఈ సినిమా. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించారు. మే1 నుంచి ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
అనదర్ సింపుల్ ఫేవర్ (Another Simple Favor)
అమెరికన్ బ్లాక్ కామెడీ మిస్టరీ ఫిల్మ్ మే1న అమోజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. ఇటలీలోని కాప్రి ద్వీపంలో ఇటాలియన్ వ్యాపారవేత్తతో జరిగిన ఎమిలీకి వివాహం జరుగుతుంది. అదే పెళ్లిలో ఒక హత్య జరుగుతుంది. దాంతో ఎమిలీ, స్టెఫానీ స్మథర్స్ ఇద్దరు చాలా సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది ఈ సినిమా కథ.
బ్రోమాన్స్ (Bromance)
మలయాళంలో రూపుదిద్దుకున్న అండ్వెంచర్ కామెడీ ఫిల్మ్ 'బ్రోమాన్స్'. అరుణ్ డీ జోస్ రచించి దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో మంచి సక్సెస్ ను అందుకుంది. కాగా మే1న సోనీలివ్ లో ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది. చూసి ఎంజాయ్ చేయండి.
బ్లాక్ వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్ (Black White & Gray- Love Kills)
సీరియ్ కిల్లింగ్ కేసులకు సంబంధించిన కథ ఇది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ప్రేమ, మోసాన్ని చూపించే అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. మే2 నుంచి సోనీలివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications











