This Week Theatre and OTT Movies : శుభం, సింగిల్, జాక్.. ఈ వారం థియేటర్, ఓటీటీలోకి మొత్తం 6 చిత్రాలు

ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే4 వరకు థియేటర్లలోకి స్టార్ హీరోల చిత్రాలు వస్తుండటం విశేషం. నేచురల్ స్టార్ నాని, తమిళ అగ్ర హీరో సూర్య, తదితరులు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు ఓటీటీలోనూ నిజ జీవిత చిత్రాలు, యాక్షన్, రొమాంటిక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్బంగా ఏఏ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.. ఏఏ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుందనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. ముందుగా థియేటర్లలోకి రాబోయే చిత్రాల విషయానికొస్తే..

శ్రీ విష్ణు '#సింగిల్'..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ #Single. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్ సమర్పించగా.. విద్య కొప్పినీడి, బాను ప్రతాప, రియాజ్ చౌదరి నర్మించారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే9న విడుదల కాబోతోంది.

This Week Theatre and Ott movie Releases

సమంత 'శుభం'..
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాత రూపొదించిన తొలి చిత్రం 'శుభం'. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. సమంతా రూత్ ప్రభు ముఖ్య అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హర్షిత్ ఆర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతమ్, షాలిన కొండెపుడి, వంశీధర్ గౌడ్ నటీనటులుగా అలరించబోతున్నారు.

శ్రద్ధా శ్రీనాథ్ 'కలియుగం 2064'..
జెర్సీ మూవీ హీరోయిన్ శ్రీనాథ్ తాజాగా నటించిన చిత్రం 'కలియుగం 2064'. ఈ సినిమా తమిళంలో రూపొందింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ లీడ్ రోల్స్ లో నటించారు. థ్రిల్లర్, డ్రామా జోనర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులోనూ మే9న గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఓటీటీ రిలీజ్ లు..

నితిన్ రాబిన్ హుడ్..
టాలీవుడ్ స్టార్ నితిన్ - టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలా నటించిన రీసెంట్ ఫిల్మ్ రాబిన్ హుడ్. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఓటీటీలోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మే10న ఈ చిత్రం జీ5లో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రాబోతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది.

సిద్ధూ జొన్నలగడ్డ జాక్..
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ యాక్షణ్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీ 'జాక్'. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదలైంది. మే8న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

తమన్నా భాటియా 'ఓదెల 2'..
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా రీసెంట్ గా 'ఓదెల 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగసాధువుగా ఆడియెన్స్ ను అలరించింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం మే16 నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X