Amazon Prime Video ఈ వారం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే.. అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్ మీరు చూశారా?
ప్రస్తుతం అంతా ఓటీటీలే వినోద పరిశ్రమను శాసిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఓటీటీలో రిలీజైన సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాక వారం వారం ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందులో ట్రెండింగ్ లో నిలిచేది మాత్రం కొన్ని సినిమాలే. మరి ఈవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలపై లుక్కేద్దాం పదండి.
1. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చింది. దిల్ రాజు ఈ మూవీని 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా, నెగిటివ్ టాక్ కారణంగా కనీసం అందులో సగాన్ని కూడా రాబట్ట లేకపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందని ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతోంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 1లో ట్రెండ్ అవుతుంది.

2. తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా
'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. కృతి సనన్, షాహిద్ కపూర్ జంటగా నటించిన ఈ మూవీకి ఈ స్పందన వచ్చినప్పటికీ 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదవ చిత్రంగా నిలిచింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ టాప్ 3లో ట్రెండ్ అవుతుంది. శక్తి సింగ్ ప్రతాప్ హడా దర్శకత్వంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటిటిలో మాత్రం అదరగొడుతోంది.

4. ది ఐడియా ఆఫ్ యు
మైకేల్ షోల్డర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇంగ్లీష్ మూవీ అమెజాన్ లో నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

5. కాగజ్ 2
వికే ప్రకాష్ దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన మూవీ కాగజ్ 2. ఒక వ్యక్తి ర్యాలీలు, నిరసనల కారణంగా జరిగిన ఆలస్యం వల్ల అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తన కూతురి ప్రాణాలను కోల్పోతాడు. ఆ తర్వాత ఆయన చేసే న్యాయపోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ.



Click it and Unblock the Notifications











