OTTలో ఈ వారం టాప్ 10 భారీ రెస్పాన్స్​ సిరీసులివే.. మీరు ఏమైనా మిస్ అయ్యారా?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సినీ తారలు, సినిమాలు, వెబ్​సిరీస్​లపై సర్వేలు నిర్వహిస్తూ వాటి గురించి తెలుపుతుంటుంది. అలా తాజాగా ఓటీటీలో అందుబుటులో ఉన్న ఒరిజనల్స్​పై సర్వే చేసి ఈ వారం టాప్​లో ఉన్న వాటి గురించి తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

బాలీవుడ్‌ హీరోయిన్​ అలియా భట్‌ నిర్మాతగా, ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ పోచర్‌. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కేరళ అడవుల్లో ఏనుగులను చంపుతూ వాటి దంతాల అక్రమ రవాణాకు సంబంధించి సిరీస్​ను రూపొందించారు. ఈ భూమ్మీద జీవించే అన్ని జీవరాశులపై కరుణ, జాలి ఉండాలనే బలమైన సందేశాన్ని 'ఇందులో చూపించారు.

This Week Top 10 Web Series List Poacher Bhakshak Sun Flower Etc Full Details Here

ఇక జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సన్​ఫ్లవర్ సీజన్ 2 రెండో స్థానంలో నిలిచింది. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ మామ్లాలీగల్ హై కూడా మంచి రెస్పాన్స్​ను దక్కించుకుని మూడో స్థానం సంపాదించుకుంది. సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి కుంద్రా, వివేక్‌ ఒబెరాయ్ కీలక పాత్రల్లో రోహిత్‌శెట్టి రూపొందించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ నాలుగు స్థానంలో కొనసాగుతోంది. అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మహారాణి సీజన్ 3 రాజకీయం నేపథ్యంలో రూపొందిన సిరీస్‌ ఇది. హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించింది. పెద్దగా చదువుకోని ఓ మహిళ ప్రభుత్వంలోని పెద్దలను ఎదురించాల్సి వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వ్యవస్థతో ఆమె ఎలా పోరాడింది అన్నదే ఈ స్టోరీ. తొలి రెండు సీజన్లు బాగా హిట్ అయ్యాయి. మూడో సీజన్​ సోనీలివ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఐదో స్థానంలో నిలవగా.. ఇక ప్రేక్షకుల మన్నలను అందుకున్న అవతార్ ది లాస్ట్ ఎయిర్​బెండర్​ ఆరో స్థానంలో నిలిచింది.

This Week Top 10 Web Series List Poacher Bhakshak Sun Flower Etc Full Details Here

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు 'ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ : ది బర్రీడ్‌ ట్రూత్‌' పేరుతో డాక్యూమెంటరీగా నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఏడో స్థానంలో నిలిచింది.

ఇక బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్న భూమి పెడ్నేకర్ నటించిన ఇన్వెస్టిగేషన్​ థ్రిల్లర్​ భక్షక్​ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పుల్‌కిత్‌ దర్శకత్వం వహించారు. నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది. ఇక షోటైమ్(డిస్నీ హాట్ స్టార్​), షోగన్(డిస్నీ హాట్ స్టార్​ ప్లస్​) కూడా టాప్​ 10లో చోటు దక్కించుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X