ఈవారం ఓటీటీలో దుమ్ము రేపుతున్న సిరీస్ లు, సినిమాలివే.. సిద్దార్థ్ సిరీస్ కు ఎన్నో స్థానమంటే?

భారత ఓటీటీలో వెబ్ సిరీస్, ఒరిజినల్ సినిమాలు ఎప్పటి నుంచో సందడి చేస్తున్నా లాక్ దౌన్ తరువాత తర్వాత వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విదేశాల సిరీస్ లతో పాటు భారత దేశ వ్యాప్తంగా అలాగే ప్రాంతీయ భాషలలో సైతం వెబ్ సిరీస్ లు, ఒటీటీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా విడుదలైన ఫ్యామిలీ మాన్, పాతాళ లోక్, వంటి సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ లలో ఈ వారం ఏ వెబ్ సిరీస్, ఏ సినిమాకు డిమాండ్ ఏర్పడింది అనే విషయం మీద ఓర్మాక్స్ మీడియా సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం టాప్ టెన్ లో ఉన్న వెబ్ సిరీస్ లు, సినిమాల మీద ఒక లుక్కు వేద్దాం

1.పంచాయత్ 2, 2. స్ట్రేంజర్ థింగ్స్ 4

1.పంచాయత్ 2, 2. స్ట్రేంజర్ థింగ్స్ 4

పంచాయత్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ మే 20 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి కూడా ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన లభిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఒక గ్రామం నేపథ్యంలో ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ లిస్టులో మొదటి స్థానం సంపాదించింది. ఇక గతంలో విడుదలైన స్ట్రేంజర్ థింగ్స్ 3 సీజన్ లకి కొనసాగింపుగా స్ట్రేంజర్ థింగ్స్ నాలుగో సీజన్ విడుదల చేశారు. నెట్ ఫిక్స్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందిన ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సిరీస్ ఇప్పుడు టాప్ టెన్ లో రెండవ స్థానంలో నిలిచింది.

3.మోడరన్ లవ్: ముంబై 4. ఎస్కేప్ లైవ్

3.మోడరన్ లవ్: ముంబై 4. ఎస్కేప్ లైవ్


అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన మోడరన్ లవ్: ముంబై నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పూర్తిస్థాయి దేశి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ టెన్ లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సిద్ధార్థ ప్రధాన పాత్రలో రూపొందిన ఎస్కేప్ లైవ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ ఇప్పుడు టాప్ టెన్ లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సిరీస్ ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది.

5. ఆశ్రమ్ 3, 6. మూన్ నైట్

5. ఆశ్రమ్ 3, 6. మూన్ నైట్


బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఆశ్రమ్ సీజన్ 1,2 లకి కొనసాగింపుగా మూడో సీజన్ త్వరలో విడుదల కానుంది. ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రసారం కావాల్సిన ఈ సీజన్ విడుదలకు ముందే ప్రేక్షకులు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాప్ టెన్ లో 5వ స్థానాన్ని దక్కించుకుంది ఈ సిరీస్. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న మూన్ నైట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీజన్ వన్ గా ప్రసారం అయిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ మార్చి 30వ తేదీ నుంచి ప్రసారమవుతుంది. ఈ సిరీస్ ఇప్పుడు లిస్టు లో ఆరో స్థానాన్ని సాధించింది

7. థార్ 8.రుద్ర

7. థార్ 8.రుద్ర


రాజస్థాన్లోని ఎడారి నేపథ్యంలో రూపొందిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ థార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ లిస్టు లో ఏడవ స్థానాన్ని సాధించింది. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఫాతిమా సనా షేక్ అద్భుతమైన నటన కనబరచడంతో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అజయ్ దేవగన్ రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన రుద్ర వెబ్ సిరీస్ విడుదలై చాలా కాలమైనా ఈ సిరీస్ కి మంచి ఆదరణ దక్కుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు ఎనిమిదో స్థానాన్ని సంపాదించింది.

 9.మిస్ మార్వెల్ 10. గిల్టీ మైండ్స్

9.మిస్ మార్వెల్ 10. గిల్టీ మైండ్స్


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న మిస్ మార్వెల్ కూడా విడుదలకు ముందే మంచి స్పందన దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే లిస్టులో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న గిల్టీ మైండ్స్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో లిస్ట్ లో టాప్ టెన్ స్థానాన్ని దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X