OTT: ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న టాప్ 10 సినిమాలు.. వాటిని మీరు చూశారా?

ప్రతీ వారం ఓటీటీలో ఎన్నో కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ట్రెండింగ్ లిస్ట్ లో చేరతాయి. ఈ వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ టెన్ సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.

1. మైదాన్
అజయ్ దేవగన్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. భారత జాతీయ ఫుట్ బాల్ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో 1952 నుంచి 1962 వరకు జరిగే సన్నివేశాలను చూపించారు.

This week Trending Movies On OTT Have you watched TOP 10 movies on Amazon Prime Video

2. స్టార్
కవిన్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎలన్ దర్శకత్వం వహించారు. కలై అనే ఒక యువకుడు తమిళ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కావాలని కలలు కంటాడు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కలై స్టార్ గా ఎదగడానికి ఎదురయ్యే కష్టాలు అన్నింటిని అధిగమించాడా? అనుకున్నట్టుగా స్టార్ అయ్యాడా? అనేదే ఈ మూవీ స్టోరీ.

3. మడగావ్ ఎక్స్ప్రెస్
ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన మడగావ్ ఎక్స్ప్రెస్ మూవీకి కునాల్ ఖేము దర్శకత్వం వహించారు. ముగ్గురు చిన్ననాటి స్నేహితులు గోవా పర్యటనకు బయలుదేరుతారు. అయితే అక్కడికి వెళ్ళాక హోటల్ గదిలో మేల్కొన్నాక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఒక డాన్ కు సంబంధించిన కోకైన్, క్యాష్ వివాదంలో ఈ ముగ్గురు స్నేహితులు ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మడగావ్ ఎక్స్ప్రెస్ స్టోరీ.

This week Trending Movies On OTT Have you watched TOP 10 movies on Amazon Prime Video

4. ఆవేశం
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ ఆవేశం. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు టీనేజర్ ఇంజనీరింగ్ యువకులు చదువు కోసం బెంగళూరుకి రాగా, సీనియర్ వాళ్ళతో గొడవకు దిగుతారు. ఈ నేపథ్యంలోనే అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్థానిక గ్యాంగ్ స్టర్ రంగా అనే వ్యక్తి దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే ఆవేశం మూవీ స్టోరీ.

5. ఆ ఒక్కటి అడక్కు
అల్లరి నరేష్ పర్య అబ్దుల్లా హీరో హీరోయిన్గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రానున్న 25 రోజుల్లోపు వివాహం చేసుకోకపోతే హీరో జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని ఓ పూజారి జోస్యం చెప్తాడు. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇంకా యోధ, టెనెంట్, రత్నం, తేరి బాతో మెయిన్ ఎసా ఉజా జియా, డైహార్ట్ 2 సినిమాలు వరుసగా టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X