OTT: తంగలాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ లెక్కలు తేలకపోవడం వల్లే విక్రమ్ మూవీ వాయిదా?

ఈ ఏడాదిలో వచ్చిన పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో మన తెలుగు నుంచే దాదాపు సినిమాలు సాలిడ్ వసూళ్లు అందుకొని అదరగొట్టాయి. అలాగే హిందీ సహా మలయాళ సినిమా నుంచి కూడా పలు చిత్రాలు ఈ ఏడాది సెన్సేషనల్ రన్ ని చూపించాయి కానీ తమిళ సినిమా పరిస్థితి మాత్రం అంతంత మాత్రం గానే మిగిలింది అని చెప్పాలి. కాగా తమిళ్ నుంచి ఈ ఏడాది పెద్ద సినిమాలు రాలేదా అంటే వచ్చాయి కానీ వాటికి అనుకున్న రేంజ్ స్పందన రాలేదు.

మొన్న వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా గ్రేటెస్ట్ ఆఫ్ ప్లాప్ గానే మిగిలిపోయింది. ఇలా తమిళ సినిమా మాత్రం బాగా స్ట్రగుల్ అవుతుంది. అయితే దీనికి ముందు తమిళ్ నుంచి మరో భారీ పాన్ ఇండియా సినిమా కూడా వచ్చింది. కాగా ఆ సినిమానే "తంగలాన్". నటన అంటే ప్రాణం పెట్టేసే నటుడు చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ రియలిస్టిక్ పీరియాడిక్ చిత్రం మంచి రెస్పాన్స్ నే అందుకుంది.

this why vikrams kgf thangalaan not yet comes in ott

కన్నడ సెన్సేషనల్ హిట్ KGF నేపథ్యంలోనే తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. పోనీ సినిమా మరీ దారుణంగా ఉందా అంటే అది కూడా కాదు అయినప్పటికీ ఈ సినిమా విషయంలో ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది. దీనితో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

కాగా ఈ సినిమా వచ్చి చాలా వారాలు అయ్యిపోయింది కానీ దీనితో వచ్చిన అన్ని సినిమాలు ఓటిటిలో వచ్చేసాయి కానీ ఇది మాత్రం ఇంకా రాలేదు. కాగా దీనికి గట్టి కారణమే ఉన్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒరిజినల్ గా ఈ చిత్రాన్ని ప్రపంచ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వాళ్లు సొంతం చేసుకున్నారు. అయితే దీనికి ముందు విక్రమ్ నటించిన బిగ్ హిట్ సినిమాలు పొన్నియిన్ సెల్వన్ 1, 2 లు భారీ డబ్బులు చేసాయి.

this why vikrams kgf thangalaan not yet comes in ott

సో కూడా కూడా వర్కౌట్ అవుతుంది ఏమో అనే లెక్కలోనే భారీ అమౌంట్ ఇచ్చే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టుగా టాక్ వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. దీనితో నిర్మాతలకి నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంకి నడుమ కొన్ని డబ్బుల లెక్కలు తేలడం లేదట. అందుకే నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ ని హోల్డ్ లో ఉంచారని తెలుస్తుంది.

ఈ సినిమాకి నిర్మాతలు ఆస్కార్ లెవెల్ రేంజ్ లో హైప్ ఇస్తూ విడుదల చేశారు కానీ ఆ రేంజ్ లో సినిమా అందరికీ అనిపించలేదు. జస్ట్ ఓకే రేంజ్ లో అనిపించింది అంతే తప్ప ఆస్కార్ లెవెల్ సినిమా కాదని తేల్చేసారు. మరి ఇలా ఓవర్ హైప్ మూలాన నెట్ ఫ్లిక్స్ ఎక్కువే పెట్టి ఉండొచ్చు కానీ ఫైనల్ గా సినిమా కమర్షియల్ గా ప్లాప్ అనే టాక్ ఉంది. మరి ఇవన్నీ తేలి ఎప్పుడు సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

More from Filmibeat

Read more about: vikram malavika mohanan pa ranjit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X