Thudarum OTT Release: మోహన్‌లాల్ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యం.. ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 65 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మించి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి ఖచ్చితంగా నాలుగైదు సినిమాలు రిలీజ్ చస్తూ దుమ్మురేపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎల్ 2: ఎంపురాన్ వంటి భారీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మోహన్‌లాల్ ప్రస్తుతం తుడరమ్ మూవీతో సందడి చేస్తున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఏళ్ల తర్వాత మోహన్‌లాల్- శోభన జంటగా
మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ శోభన చాలా కాలం తర్వాత జంటగా నటించిన తుడరం చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం రంజిత్ ఈ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన తుడరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్నింగ్ షో నుంచే హిట్ టాక్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. మోహన్‌లాల్ క్రేజ్, ఇతర అంశాల కారణంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న తుడరం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 20 రోజుల వరకు ఈ చిత్రం ఇండియాలో రూ. 104.34 కోట్ల నికర వసూళ్లు సాధించింది.
200 కోట్ల వసూళ్లతో తుడరం రికార్డ్
మలయాళంలో రూ.101.17 కోట్లు రాబట్టిన తుడరం.. తెలుగులో రూ.1.85 కోట్లు, తమిళంలో 97 లక్షల రూపాయల నికర వసూళ్లను ఆర్జించింది. తద్వారా ఇండియాలో రూ.103.99 కోట్ల నెట్.. రూ.117.95 కోట్ల గ్రాస్ అందుకుంది మోహన్‌లాల్ చిత్రం. అయితే ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో తుడరంకు రూ.90.5 కోట్లు వచ్చాయంటే అక్కడి పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తుడరం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.208 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. కేరళలో అన్ని సినిమాల రికార్డులను తిరగరాస్తు.. తొలిసారి 100 కోట్ల మార్క్ దాటిన సినిమాగా నిలిచింది. దీనిపై మోహన్‌లాల్ సైతం భావోద్వేగానికి గురయ్యారు.
ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం
ఇంతటి ఘన విజయం సాధించిన తుడరం చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు మాలీవుడ్ టాక్. థియేటర్‌లో విడుదలైన 5 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిబంధన మేరకు తుడరం మే నాలుగో వారంలో స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. ఏమాత్రం ప్రచారం లేకుండానే తెలుగు మార్కెట్‌లో రూ.2 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం, కేరళలో తుడరం హవా ఇంకా తగ్గకపోవడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.
మరికొంతకాలం థియేటర్‌లో తుడరంను నడిపించాలని వారు భావిస్తున్నారు. దీంతో ఓటీటీ రిలీజ్ మరికొంతకాలం ఆలస్యం కానుందని మాలీవుడ్ టాక్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి తుడరం జూన్‌లో ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓటీటీ సంస్థ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











