Thug Life OTT: ఓటీటీలో థగ్‌లైఫ్.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి కమల్ హాసన్ డిజాస్టర్ మూవీ
యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థగ్‌లైఫ్. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ కార్యక్రమాలో థగ్‌లైఫ్‌గా బజ్ నెలకొంది. జూన్ 5న థగ్‌లైఫ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ రావడంతో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో థియేటర్‌లలో రిలీజై నెలకాకుండానే ఈ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
జూన్ 5న విడుదలైన థగ్‌లైఫ్
థగ్‌లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో కమల్ హాసన్, మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహించగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థగ్‌లైఫ్ రిలీజ్ అయ్యింది.

వివాదాల్లో థగ్‌లైఫ్
ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. అభిరామితో కమల్ హాసన్ లిప్‌లాక్.. హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ దుమారం రేపింది. తర్వాత థగ్‌లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణలు చెప్పేందుకు కమల్ హాసన్ నిరాకరించగా కర్ణాటకలో థగ్‌లైఫ్ విడుదల ఆగిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది. కానీ అప్పటికే జరగాల్సన నష్టం జరిగిపోయింది.
భారీ నష్టాలను మిగిల్చిన కమల్
థగ్‌లైఫ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో రూ.48.16 కోట్ల నెట్.. రూ.56.24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.41.2 కోట్లు అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లతో కలిపి థగ్‌లైఫ్‌కు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.97.44 కోట్ల మాత్రమే రాబట్ట గలిగింది. తమిళనాట కలెక్షన్స్ రికార్డులను తిరగరాస్తుందనుకున్న థగ్‌లైఫ్.. 100 కోట్ల లోపే చాప చుట్టేయడంతో కమల్ హాసన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ వసూళ్లతో థగ్‌లైఫ్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఓటీటీ డీల్ రద్దు చేసిన నెట్‌ఫ్లిక్స్
సినిమా డిజాస్టర్ కావడంతో థగ్‌లైఫ్ నిర్మాతలతో గతంలో కుదుర్చుకున్న ఓటీటీ డీల్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పక్కనపడేసి కొత్తగా బేరాలు మొదలుపెట్టింది. తొలుత థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా పడటంతో ఓటీటీ డీల్‌లో 25 శాతం మొత్తాన్ని లేదా రూ.30 కోట్లను తగ్గించాలని పట్టుపట్టింది. చివరికి రూ.20 కోట్లు తగ్గించి రూ.110 కోట్లతో థగ్‌లైఫ్ నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్‌కు మధ్య కొత్త ఒప్పందం కుదిరింది.
సైలెంట్‌గా ఓటీటీలోకి థగ్‌లైఫ్
థగ్‌లైఫ్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ఈ సినిమాను ఆగస్ట్ 15న స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. కానీ కాస్త ముందుగానే జూలై చివరి వారం లేదా ఆగస్ట్ తొలి వారంలో థగ్‌లైఫ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా థగ్‌లైఫ్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన థగ్‌లైఫ్ ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











