Tiger Nageswara Rao: ఇక్కడ డిజాస్టర్.. అక్కడ ఇండియాలోనే టాప్.. రవితేజ ఊచకోత
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. మిగిలిన స్టార్ హీరోల కంటే వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న అతడు.. తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే ఈ మాస్ హీరో 'టైగర్ నాగేశ్వరరావు' అనే పాన్ ఇండియా మూవీతో వచ్చాడు.
రవితేజ హీరోగా వంశీ అనే డైరెక్టర్ తీసిన మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించి ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. తీవ్ర డిమాండ్ నడుమ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఏమాత్రం సమాచారం లేకుండానే నవంబర్ 17వ తేదీ నుంచి రవితేజ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది.
ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీని అమెజాన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో రవితేజ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి వ్యూస్ కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం 24 గంటలకు తిరగకముందే టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు దక్షిణాది ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా మొత్తంలో టాప్ మూవీగా ట్రెండ్ అవుతోంది. తద్వారా ఈ ఘనత అందుకున్న రవితేజ తొలి చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఇంకా ఇది ఏఏ మైలురాళ్లను చేరుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











