Garmi Web Series Review: యూనివర్సిటీ రాజకీయాలు, కులాల మధ్య విద్యార్థి జీవితం.. గర్మీ రివ్యూ

రేటింగ్: 3/5

టైటిల్: గర్మీ
నటీనటులు: వ్యోమ్ యాదవ్, పునీత్ సింగ్, అనురాగ్ థాకూర్, దిశా థాకుర్, వినీత్ కుమార్, జతిన్ గోస్వామి, ముఖేష్ తివారి తదితరులు
సినిమాటోగ్రఫీ: శైలేష్ అవస్థీ
సంగీతం: సిద్ధార్థ్ పండిట్, రేవ్ షెర్జిల్
నిర్మాతలు: స్వరూప్ సంపత్, హేమల్ ఠక్కర్, ప్రాచీ శ్రీవాస్థవ
కథ: తిగ్మాన్షు ధులియా, కమల్ పాండే
దర్శకత్వం: తిగ్మాన్షు ధులియా
విడుదల తేది: ఏప్రిల్ 21, 2023
ఓటీటీ వేదిక: సోనీ లివ్ (9 ఎపిసోడ్స్)

బాలీవుడ్ దర్శకుల్లో తిగ్మాన్షు ధులియాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కువగా ఓటీటీలో వెబ్ సిరీసులు తెరకెక్కిస్తూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటికే కోర్డ్ డ్రామా 'క్రిమినల్ జస్టిస్', థ్రిల్లర్ సిరీస్ గా 'ఔట్ ఆఫ్ లవ్', మర్డర్ మిస్టరీగా సాగే 'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' వంటి వెబ్ సిరీసులు రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో సిరీస్ గర్మీ (Garmi). ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Garmi Web Series Telugu Review) చూద్దాం.

కథ: అరవింద్ శుక్లా (వ్యోమ్ యాదవ్) ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, పౌరుషం, కోపం ఉన్న విద్యార్థి. ఐఏఎస్ అవుదామన్న లక్ష్యంతో యూపీలోని త్రివేణిపూర్ యూనివర్సిటీలో చేరతాడు. అక్కడ అరవింద్ కు యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ బిందు సింగ్ (పునీత్ సింగ్) పరిచయం అవుతాడు. అతని ద్వారే అరవింద్ కు హాస్టల్ లో రూమ్ దొరుకుతుంది. తర్వాత కాలేజీలో సురభి (దిశా థాకూర్)తో ప్రేమలో పడతాడు అరవింద్.

Garmi Web Series Review

ట్విస్టులు ఇవే: అరవింద్ ప్రేమించిన అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడిపోతుంది. సురభి హాస్టల్ పై నుంచి దూకడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? బిందు సింగ్ వల్ల అరవింద్ కు జరిగిన అన్యాయం ఏంటీ? అతన్ని అరవింద్ ఎందుకు మర్డర్ చేయాలనుకున్నాడు? అరవింద్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లోకి ఎందుకు దిగాల్సి వచ్చింది? దిల్బాగ్ సింగ్ (ముఖేష్ తివారి), అరవింద్ మధ్య ఉన్న గొడవ ఏంటీ? విపరీతమైన కులపిచ్చి ఉన్న ఎస్సై మృత్యుజయ సింగ్ (జతిన్ గోస్వామి)ను అరవింద్ ఎదుర్కొన్నాడా? అరవింద్ వెంటే ఉండే గోవింద్ మౌర్య (అనురాగ్ థాకూర్) ఏం చేశాడు? అసలు అరవింద్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా అని ఆసక్తికర విషయాల సముహారమే గర్మీ.

విశ్లేషణ: సాధారణంగా యూనివర్సిటీలో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ సిరీస్ ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉండే రాజకీయాలను చూపించారు. ఇప్పటికి ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. హిందీలో కూడా తాండవ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. అయితే అందులో చాలా తక్కువగా యూనివర్సిటీలోని విద్యార్థలతో చేసే రాజకీయాలు తక్కువగా ఉంటాయి. కానీ సిరీస్ మొత్తం యూనివర్సిటీ పాలిటిక్స్ పై తెరకెక్కించారు.

Garmi Web Series Review

ఎలా వాడుకుంటారు?: అరవింద్ శుక్లా పాత్ర తీరు, కుటుంబ పరిస్థితిని ఒకటి రెండు సన్నివేశాలతో చూపించి నేరుగా కథలోకి వెళ్లారు. త్రివేణిపూర్ యూనివర్సిటీలో జరిగే రాజకీయాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వైరం, డబ్బు, పదవి వంటి అంశాలను చూపించి ఆసక్తి పెంచారు. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. విద్యార్థులను పొలిటికల్ లీడర్స్, విద్యార్థి నాయకులు ఎలా వాడుకుంటారు, ఎందుకు వాడుకుంటారో బాగా చూపించారు.

కులాలపై వివక్షత: తక్కువ కులాలపై చూపించి వివక్షత, అగ్ర కులంలో పుట్టిన వారికి జైలులో కూడా మర్యాద ఉంటుందనే చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. గొడవ పడుతున్న రెండు పార్టీల మధ్యలోకి మూడో పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని తెలిసినప్పుడు ఈ రెండు పార్టీలు కలిసే తీరును ఆవిష్కరించిన విధానం బాగుంది. ఒక్కోసారి తక్కువ కులాల వారిని అందలం ఎక్కించడానికి ఏర్పడిన పరిస్థితులను సైతం బాగా చూపించారు.

Garmi Web Series Review

ఆసక్తిగా క్లైమాక్స్: తన కులాల వారు ఐపీఎస్ వంటి పెద్ద ఉద్యోగంలో ఉంటే రాజకీయపరంగా శాసించవచ్చు అన్న ఆలోచనతో విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేయమని యూనియన్ లీడర్ కు ఎస్సై మృత్యుంజయ సింగ్ తో చెప్పించే విధానం కొందరి కుల పిచ్చికి అద్దం పట్టేలా ఆవిష్కరించారు. ప్రేమ, ఫ్రెండ్షిప్, మోసం, ద్రోహం, పాలిటిక్స్, అవినీతి, కమ్యూనిస్ట్ సిద్ధాంతం, కులాల మధ్య అంతర్గతం, తక్కువ కులాల వారు పై చదువులు చదవద్దనే వివక్షత తదితర అంశాలను స్పష్టంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అయితే అరవింద్ శుక్లా చివరిగా ఏం అవుతాడనేది ముందే ఊహించవచ్చు. ఇక క్లైమాక్స్ ఆసక్తికరంగా ఎండ్ చేసి తర్వాతి సీజన్ కు హింట్ ఇచ్చారు.

Garmi Web Series Review

ఎవరెలా చేశారంటే? : ఆవేశం, పట్టుదల ఉన్న విద్యార్థి అరవింద్ శుక్లాగా నటించిన వ్యోమ్ యాదవ్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ పాత్రలో అతను జీవించేశాడు. స్టూడెంట్ యూనియన్ లీడర్ కోసం ఆరాటపడే వ్యక్తులుగా పునీత్ సింగ్, అనురాగ్ థాకూర్ ఇద్దరూ చాలా బాగా చేశారు. ఇక మృత్యుంజయ సింగ్ పాత్రలో జతిన్ గోస్వామి బెస్ట్ ఇచ్చారు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో అదరగొట్టారు. బీజీఎమ్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, ఎడిటింగ్, సాంకేతిక వర్గం, నిర్మాణ విలువలు అన్ని బాగా కుదిరాయి.

Garmi Web Series Review

ఫైనల్ గా చెప్పాలంటే? : యూనివర్సిటీ రాజకీయాలు అనే కథాంశం పాతదే అయిన దాన్ని దర్శకుడు తీర్చి దిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. అందులో చూపించే ఒక్కో అంశం ఆలోచింపజేసేలా ఉంటుంది. ఎక్కడైతే కుల వివక్షతో పోవాలో అక్కడే కులాలపై రాజకీయాలు జరగడమనే అంశాన్ని బాగా టచ్ చేశారు. సుమారు 45 నిమిషాలతో 9 ఎపిసోడ్స్ ఉన్న గర్మీ వెబ్ సిరీస్ (Garmi Web Series Review)ను టైమ్ ఉంటే చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X