ముందుగానే ఓటీటీలోకి టిల్లు స్క్వేర్.. 100 కోట్ల మూవీ ఎప్పుడు వస్తుందో తెలిస్తే!

టాలీవుడ్‌లో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో రొమాంటిక్ అండ్ కామెడీ మూవీలు మాత్రం మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలా గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీనే 'డీజే టిల్లు'. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ కూడా వచ్చింది. అదే 'టిల్లు స్క్వేర్' మూవీ.

మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన సినిమానే 'టిల్లు స్క్వేర్'. హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో దీనిపై ఆరంభంలోనే భారీగా హైప్ క్రియేట్ అయింది. దీనికితోడు ఈ మూవీ ప్రచార చిత్రాలు మెప్పించడంతో దీనిపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే 'టిల్లు స్క్వేర్' సినిమాను మార్చి 29వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Tillu Square Movie Digital Streaming Starts Before 30 Days

సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన కూడా లభిస్తోంది. ఇలా ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా సిద్దు కెరీర్‌లో బెస్ట్ మూవీ అయింది.

ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న 'టిల్లు స్క్వేర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు రూ. 35 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది.

సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 30 రోజుల లోపే ఓటీటీలోకి తీసుకు వస్తున్నారట. ఇదే నిజం అయితే సినీ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు.

Tillu Square Movie Digital Streaming Starts Before 30 Days

ఇదిలా ఉండగా.. 'టిల్లు స్క్వేర్' మూవీలో సిద్దుకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అచ్చు, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. భీమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇందులో నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్ కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X