అనుకున్న తేదీకంటే ముందుగానే OTTలోకి క్రేజీ దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ ప్రియులకు సమ్మర్ అంతా పండగే. ఎందుకు అంటారా.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు తెస్తూ.. వారిని క్షణం తీరిక లేకుండా టీవీల, ఫోన్ల ముందు కూర్చోపెడుతూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు పండగే కదా. ఎండల భయంతో ఇంట్లోనే ఉంటున్న అంతా సినిమాలు, సిరీస్ లు చూస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీలోకి అనేక క్రేజీ క్రేజీ సినిమాలు ఉండగా.. మరో క్రేజీ దెయ్యం సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అంతా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. మరి ఆ సినిమా ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చి గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తీసుకు వచ్చారు. ఫస్ట్ పార్ట్ లో లాగానే ఈ సినిమాలోనూ అంజలియే హీరోయిన్. శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. అలాగే అంజలితో పాటు సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ, శ్రీనివాస్, సత్య వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్రెవల్ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇలా బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా త్వరగానే థియేటర్లలోంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన ఆహా వీడియో వేదికగా ఈ క్రేజీ దెయ్యం సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆహానే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. మే 8వ తేదీ నుంచి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఆహా వేదికగా అందుబాటులో ఉండబోతున్నట్లు వివరించింది. ఆ విషయం తెలుసకున్నప్పటి నుంచి ఓటీటీ ప్రియులు అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. హార్రర్ కామెడీ మూవీని చూడాలని తహతహలాడుతున్నారు.
సినిమా టాక్ ఎలా ఉన్నా... కాసేపు భయపడుతూ నవ్వుకోవడానికి అయినా ఈ సినిమాను కచ్చితంగా చూడాలని అనుకుంటున్నారు. మరి అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ క్రేజీ మూవీని ఓటీటీ వేదికగా కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











