OTTలో హాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మూవీ, ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి చిత్రాలు అయినా ఓటీటీ వేధికగా చూసేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు సినీ ప్రియులు. అయితే తాజాగా ఓటీటీలో మరో హాలీవుడ్ సినిమా వచ్చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంగ్లీష్ సినిమా ఓటీటీలోకి రావడంతో అంతా సంబురపడిపోతున్నారు. ముఖ్యంగా ఆ సినిమా ఏంటి, ఆ చైల్డ్ ఆర్టిస్ ఎవరు వంటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరపై కనిపిస్తూ.. ఎప్పుడూ వచ్చే ఓ అద్భుతమైన యాడ్ లలో ఒకటి ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ యాడ్. అయితే ఈ యాడ్ లో అమ్మ చేసింది మిస్ లైట్ గానే ఉంటుందంటూ డైలాగ్ చెబుతూ కనిపించిన అమ్మాయే అవంతిక వందనపు. యాడ్స్ తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం, పవన్ కల్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి సినిమాలోతో పాటు ప్రేమమ్ చిత్రంలోనూ కనిపించి అందిరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్లిపోయిందీ చిట్టి పాపాయి.

ఇక్కడ చైల్ట్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ మాత్రం హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుని అదిరిపేయే చిత్రాలు చేసింది. తాజాగా ఈమె మీన్ గర్ల్స్ అనే చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చింది. కేవలం నటనే కాదండోయ్... అంతకు మించిన హాట్ షో చేస్తూ... రచ్చ చేసింది. ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో అయితే నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ పాటలోనే అవంతిక వందనపు విపరీతమైన హాట్ గా కనిపించగా.. ఇక సినిమాలో ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే జనవరి 12వ తేదీన థియేటర్లలలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇదంతా బాగానే ఉన్నా ఇండియాలో ఉన్న వాళ్లు మాత్రం ఈ సినిమాను చూసే వెసులుబాటును ఇంకా కల్పించలేరు. కేవలం అమెరికాలో మాత్రమే ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా విడుదల చేశారు.
త్వరలోనే అవంతిక వందనపు హీరోయిన్ గా వచ్చిన మీన్ గర్ల్స్ సినిమా భారతదేశంలో కూడా అందుబాటులోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు ఈ సినిమా అందుబాటులోకి రానుందో. కేవలం హాలీవుడ్ లో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అవంతిక చాలా బిజీగా గడిపేస్తోంది. అవంతిక నటించిన మరో రెండు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











