Faria Abdullah: తొలిసారి బయట పడ్డ ఫరియా అబ్ధుల్లా సీక్రెట్.. చిట్టి చిన్న టాటూను మీరూ గుర్తించారా?
ఫరియా అబ్దుల్లా.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఈ క్యూట్ బ్యూటీకీ సంబంధించిన ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆమె నడుము పైభాగంలో ఉన్న ఓ సీక్రెట్ టాటూ రివీల్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, చిట్టి చిన్న టాటూను నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
2021లో జాతి రత్నాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ మైమరిపించింది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కూడా చేసింది.

ఆ తర్వాత ఏడాది బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను పోస్ట్ చేస్తుంటుంది.
తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ... అంతకు మించిన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని నెట్టింట పెడుతుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు పోస్ట్ చేసింది. అందులో చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని సోకులు ఆరబోసింది.

అయితే ఈ ఫొటోల్లో ఫరియా అబ్దుల్లాకు చెందిన ఓసీక్రెట్ టాటూ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా జాతి రత్నాలు చిట్టి.. చిన్న టాటూ బయట పడింది. నడుము పైభాగంలో ఉన్న ఈ టాటూ ఫొటోల్లో తెగ క్యూట్ గా కనిపిస్తోంది. దీంతో చిట్టి ఫొటోలు చిటికెలో వైరల్ అయ్యాయి. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. అలాగే ఈమె చిట్టి నడుముపై ఉన్న చిన్న టాటూని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











