OTT: ఓటీటీలోకి దీపావళి బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
తెలుగు సినిమా దగ్గర సినిమా పండుగ వేరేలా పండుగ వచ్చినపుడు సినిమా పండుగ వేరే లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. బాగా డ్రై గా ఉన్న సమయంలో ఓ స్టార్ హీరో సినిమా పడితే అది థియేటర్స్ లో పెద్ద పండుగలా మన తెలుగు ఆడియెన్స్ చేసుకుంటారు. అదే పండుగ సమయంలోనే సినిమాలు వస్తే దానిని మరింత లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటారు.
అందుకే మన తెలుగు ఆడియెన్స్ అంటే చాలా మంది ఇతర హీరోలకి బాగా ఇష్టం. కాగా అలా ఇపుడు దీపావళి పండుగ కూడా వచ్చేసింది. మొత్తం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలకరించేందుకు వచ్చేసాయి. కాగా ఈ నాలుగు సినిమాల్లో రెండు మన తెలుగు సినిమా నుంచే వచ్చినవి అయితే మరో రెండు సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చాయి.

కాగా ఈ నాలుగు సినిమాలు కూడా ఒకొకటి ఒకో టాక్ ని తెలుగు ఆడియెన్స్ లో తెచ్చుకున్నాయి. అయితే మన తెలుగు ఆడియెన్స్ పలు సినిమాలకి థియేటర్స్ లో ఎంత ఆదరణ ఇస్తారో ఓటిటిలో కూడా అలానే చూస్తారు. మరి ఇలా ఈ దీపావళి కానుకగా వచ్చిన సినిమాల తాలుకా ఓటిటి డీటెయిల్స్ చూసినట్టు అయితే మొదటగా మన తెలుగు సినిమాలు నుంచే వస్తే..

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా "లక్కీ భాస్కర్" ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులు పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొని తమ దగ్గర పెట్టుకుంది. ఇక మరో సినిమా యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "క". ఒక క్రేజీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాని సందీప్, సరోజ్ లు దర్శకత్వం వహించగా ఈ సినిమాని తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకున్నారు.

ఇక మిగతా రెండు సినిమాల్లో తమిళ సినిమా శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆర్మీ నేపథ్య ఎమోషనల్ సినిమా "అమరన్" కూడా నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఇక ఫైనల్ గా కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళీ "సలార్" ఒరిజినల్ సినిమా నటుడు చేసిన భారీ సినిమా "బఘీర" ఇందులో రుక్మిణి వసంత్ నటించింది. కాగా ఈ సినిమా హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వద్దనే ఉండడం విశేషం.

ఇలా దీపావళి కానుకగా భారీ హైప్ నడుమ వచ్చిన మొత్తం నాలుగు సినిమాల్లో మూడు సినిమాల తాలూకా హక్కులు భారీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దగ్గరే ఉన్నాయి. సో ఈ అన్ని సినిమాల థియేట్రికల్ రన్ అనంతరం దాదాపు నెల లోపే అన్ని సినిమాలు ఓటిటిలో వచ్చేయవచ్చు. కాగా దాదాపు వీటిలో ఒక్క "క" తప్ప మిగతా అన్ని సినిమాలకి పాన్ ఇండియా భాషల్లోనే ఓటిటి రిలీజ్ ఉంటుంది. దీనితో ఇపుడు థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న సినిమాలు నెక్స్ట్ ఆ ఓటిటి లలో చూడొచ్చు..


Click it and Unblock the Notifications











