Keerthy Suresh: "అక్క"గా రాబోతున్న కీర్తి సురేష్.. ఎవరికో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకోవడంలో ముందుండే ఈ ముద్దుగుమ్మ నేను శైలజ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆమె చేసిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అయ్యాయి. గ్లామరస్ పాత్రలోనే కాకుండా డీగ్లామరస్ పాత్రల్లో కూడా అలరించి మెప్పించగల సత్తా ఉన్న ఈమె... మహానటి చిత్రంలో అందరి మన్ననలు పొందింది. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈమె.. వరుసగా చిత్రాలు చేస్తూ అదరగొడుతోంది.
ముఖ్యంగా స్టార్ హీరోల అందరి సరసన నటిస్తున్న ఈమె.. తాజాగా ఓటీటీలోకి అడుగు పెడుతోంది. తొలిసారిగా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది. అక్క అనే వెబ్ సిరీస్ లో అదిరిపోయే పాత్రలో కనిపించి అందరినీ అలరించడానికి వస్తోంది. ముఖ్యంగా యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న మూడో వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ మరో హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే ఈమెతో పాటు మరో హీరోయిన్ రాధికా ఆప్టే కూడా కనిపించనుందట. ఈ వెబ్ సిరీస్ కు చిత్రబృందం అక్క అనే పేరు పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా... ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ది రైల్వే మేన్, మండలా మర్డర్స్ వంటి వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన ఈ వైఆర్ఎఫ్ నిర్మాణ సంస్థనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ముఖాముఖిగా ఇందులో తలపడబోతున్నారట. ఇదో రివెంజ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు అన్నీ పూర్తి అయ్యాయని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ విషయాలను బయటకు రానివ్వకూడదని మేకర్స్ భావించినప్పటికీ ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే ఇంకా కొంత కాలం పట్టే ఛాన్స్ ఉంది. అఫీషయల్ ప్రకటన వచ్చే వరకు ఆగితే అన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తూ... వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











