Bigg Boss Nonstop: ఆడపులికి టాలీవుడ్ హాట్ హీరోయిన్ మద్దతు.. నువ్వే అర్హురాలివి అంటూ!
తెలుగు ప్రేక్షుకులని అలరిస్తున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో తెలుగు ఓటీటీ తొలి విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ఇప్పటికే షోకి సంబంధించి అనేక అంచనాలు, అనధికరిక సర్వేలు బయటకు వస్తున్నాయి. లీకులకు కూడా ఏమాత్రం తక్కువ లేదు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారిలో అఖిల్ - బిందు మాధవి మధ్యే ప్రధాన పోరు స్పష్టంగా అందరికీ అర్దం అవుతుంది. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కూడా చాలా స్వల్పంగా ఉన్నట్టు అంచనాలు నెలకొన్నాయి. అయితే బింధు మాధవిని టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు

క్షణక్షణం ఉత్కంఠతో
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక మరి కొద్ది గంటల సమయంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 విన్నర్ ఎవరు అనేది తెలిసి పోనుంది. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు బిగ్ బాస్ టైటిల్ బిందుమాధవి సొంతం చేసుకుందని అంటున్నారు. అయితే గత సీజన్లన్నింటిలోనూ విన్నర్ ఎవరో స్పష్టంగా ప్రేక్షకులు ఊహించగలిగారు కానీ ఈసారి మాత్రం అంచనా వేయడం కష్టంగా మారింది.

టాలీవుడ్ హీరోయిన్ మద్దతు
ఓరోజు అఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు బిందు మాధవి మొదటి స్థానానికి వచ్చి చేరుతోంది. దీంతో అఖిల్ -బిందుల మధ్య చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అభిమానులు కూడా కొంతమంది అఖిల్ కి సపోర్ట్ చేస్తుందే మరి కొంతమంది బిందుమాధవికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు బిందు మాధవికి టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన మద్దతును ప్రకటించింది.

నువ్వే అర్హురాలివి
సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా 'నువ్వు టైటిల్ అందుకునేందుకు అర్హురాలివి' అని పాయల్ కామెంట్ పెట్టింది. ఇక చూసి ఆమె అభిమానులు బిందు మాధవికి ఓట్లేసే అవకాశం ఉందా అంటే ఆ అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఓటింగ్ లైన్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి.
అన్నట్టు బిందుకు పాయల్ రాజ్ పుత్ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా మద్దుతుగా మాట్లాడింది, ఏకంగా ఆమె బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చింది.

ఆసక్తికరంగా
అయితే బిందు ఒకప్పుడు తెలుగు హీరోయిన్ అయినా సరే ఆమెకు తెలుగులో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అదే సమయంలో అఖిల్ విషయానికి వస్టే బిగ్ బాస్ 4లో రన్నరప్ గా నిలిచాడు. ఆ సీజన్లో అభిజిత్ కి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చిందో అందులో కొంత అఖిల్ కూడా సంపాదించగలిగాడు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే కొనసాగుతోంది.

చరిత్ర సృష్టించినట్టే
కానీ బిందుమాధవి ఫ్రెషర్ గా వచ్చి అభిమానులను సంపాదించుకుంది. దాదాపుగా బిందుమాధవి టైటిల్ గెలుచుకుంది అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో అదే కనుక జరిగితే బిందుమాధవి హిస్టరీ క్రియేట్ చేసినట్లే చెప్పాలి. తెలుగు బిగ్బాస్ చరిత్రలో 5 సీజన్ పూర్తి అయ్యాయి కానీ ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా టైటిల్ గెలిచింది లేదు.


Click it and Unblock the Notifications











