twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీ విడుదల తేదిలపై టాలీవుడ్ మరో కీలక నిర్ణయం.. చర్చలు ఎంతవరకు వచ్చాయంటే..?

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పెరుగుతున్న రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ వంటి విషయాల వలన నష్టాలు రాకుండా తెలుగు సినిమాను, థియేట్రికల్ వ్యాపారాన్ని కాపాడేందుకు కొన్ని కీలక నిర్ణయాలపై ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ విడుదల తేదిలపై కూడా నిర్మాతలు చాలా ధీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా థియేటర్లలో విడుదలైన 8 వారాలకు గాని ఓటీటీలో సినిమాను ప్రసారం చేయకూడదని తెలుగు చలనచిత్ర నిర్మాతల సంఘం నిర్ణయించింది.

    తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అలాగే యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కలిసి ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నిర్మాతలు కొన్ని కీలకమైన నియమాలు నిబంధనలను రూపొందించారు. ఇక టికెట్ ధరలు కూడా వివాదాస్పదంగా మారాయి. అదే విషయంలో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌ల యాజమాన్యం సహా ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చలు జరిపారు. ఈ విషయంలో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Tollywood industry another key decision on ott movies releases

    నిర్మాతల మధ్య గత రెండు మూడు రోజుల నుంచి చివరి రౌండ్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. కాగా, చిత్ర షూటింగ్‌లను పునఃప్రారంభించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని నిర్మాతలు మీడియాకు తెలిపారు. నిర్మాణ ఖర్చులు తగ్గాలనే కారణం వలన సినిమా షూటింగ్‌లను నిలిపివేశారు. త్వరలోనే ఈ విషయం కూడా ఒక కొలిక్కి రానుంది.

    గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్ చాలా వరకు వాయిదా పడడంతో విడుదల తేదీలపై కూడా మళ్లీ కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా నిర్మాతలు ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ షూటింగ్స్ కొనసాగే విధంగా చేయాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఈ రూల్స్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా యధావిధిగా షూటింగ్స్ కూడా కొనసాగిస్తున్నట్లు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది తమిళ సినిమా అంటూ మరికొందరు పాన్ ఇండియా సినిమా అంటూ కారణాలు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    English summary
    Tollywood industry another key decision on ott movies releases..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X