Sankranti Releases onOTT: టాలీవుడ్ సంక్రాంతి సినిమాలు.. ఏయే ఓటిటిల్లో ఎప్పుడంటే?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర పండుగ వాతావరణంలో వచ్చే సినిమాల సందడి వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మెయిన్ గా పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేస్ లో సినిమాలు వచ్చి హిట్ అయితే వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక ఈ అన్నిటిలో కూడా సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం అది భారీ వసూళ్లు అందిస్తుంది అని చెప్పాలి.
ఇలా తెలుగు సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు రిలీజ్ కి వచ్చి సంచలన విజయం సాధించాయి. కాగా ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన తెలుగు సినిమా నుంచి పలు సినిమాలు రిలీజ్ కి వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో అన్నీ మన తెలుగు సినిమాలే ఉండడం విశేషం. తమిళ్ నుంచి ఎలాంటి సినిమాలు తెలుగులో లేకపోవడంతో ఈ సంక్రాంతి పూర్తిగా తెలుగుదనంతో నిండిపోయింది.

ఇలా మొదటిగా ఈ సంక్రాంతి రేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా "గేమ్ ఛేంజర్"తో స్టార్ట్ చేయగా ఈ సినిమా తర్వాత నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ నటించిన భారీ సినిమా "డాకు మహారాజ్" వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత చివరి సినిమాగా విక్టరీ వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం"తో వచ్చారు. కాగా ఈ అన్ని సినిమాల్లో ఒకో దానికి ఒకో టాక్ పడింది.
కాగా ఇపుడు థియేటర్స్ లో మూడు సినిమాలు రన్ అవుతుండగా ఈ సినిమాలు మూడు పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ల తర్వాత ఏయే ఓటిటి లలో రానున్నాయి అనేది చూద్దాం. కాగా మొదటిగా గేమ్ ఛేంజర్ నే చూస్తే.. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ నెగిటివిటీ వచ్చింది. అయితే ఈ నెగిటివ్ లో కూడా సంక్రాంతి హాలిడేస్ లో మినిమమ్ బుకింగ్స్ ఈ సినిమాకి దక్కుతున్నాయి కానీ ఈ సినిమా చేసుకున్న బిజినెస్ కి ఈ వసూళ్లు ఏమాత్రం చాలవు.
దీనితో ఈ సినిమా ఈజీగా నెల లోపే ఓటిటిలో వచ్చేస్తుంది అని తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా అందులో మూడు లేదా నాలు వారాల్లోనే వచ్చేస్తుంది అని తెలుస్తుంది. దిల్ రాజు సినిమాలకి ప్రైమ్ వీడియో వారికి ఎప్పుడు నుంచో ఒక అండర్ స్టాండింగ్ ఉంది. సో గేమ్ ఛేంజర్ ని ఈ మూడు నాలుగు వారాల్లోనే ఆశించవచ్చు.

ఇక నెక్స్ట్ కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన "డాకు మహారాజ్" సినిమాని వరల్డ్ ఫేమస్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ సినిమా కూడా కేవలం 28 నుంచి 30 రోజుల్లోపే వచ్చేస్తుంది. మరి నిర్మాత నాగవంశీ తన సినిమాలుకి నెల రోజులు చాలని నెల లోపే ఓటిటిలో వచ్చినా తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పేసారు. సో ఇది కూడా నెలలో గ్యారెంటీ అంటే ఫిబ్రవరి మధ్యలోనే వచ్చేస్తుంది.
ఇక ఫైనల్ గా అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఎంటర్టైనర్ "సంక్రాంతికి వస్తున్నాం" కొంచెం అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా ఈ సినిమా మాత్రం మిగతా వాటిలా నెల లోపు వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు. జీ5 కి ఇచ్చే సినిమాలు దాదాపు నెల టైం లైన్ లో రావడం లేదు. సో దీనికి మాత్రం సమయం పట్టొచ్చు అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా ఇపుడు ఉన్న సంక్రాంతి సినిమాల్లో దీనికే మంచి హిట్ టాక్ వచ్చింది. సో థియేటర్స్ లో ఈ సినిమా రన్ గట్టిగానే ఉంటుంది అని చెప్పొచ్చు. సో సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఫిబ్రవరి మూడో వారం లేదా నాలుగో వారం లోనే రావచ్చేమో చూడాలి.


Click it and Unblock the Notifications











