twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT లో రాబోయే పెద్ద సినిమాలకు బిగ్ షాక్.. ఇక నుంచి అన్ని రోజులు ఆగాల్సిందే!

    |

    ఇటీవల కాలంలో ఒక సినిమాతో బిజినెస్ అనేది విభిన్నమైన రకాలుగా మారిపోయింది. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా విడుదలైన 50 రోజుల తర్వాత కూడా మొత్తం వ్యాపారంగానే మారుతుంది. ఒకప్పుడు కేవలం థియేట్రికల్ గానే మంచి బిజినెస్ ఉండేది. కానీ ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా నిర్మాతలకు చాలా కీలకంగా మారాయి. అయితే ఈ తరుణంలో ఓటీటీ రిలీజ్ అనేది కూడా థియేటర్స్ బిజినెస్ పై కొంత ప్రభావం చూపిస్తున్నాయని చెప్పాలి.

    ఒక సినిమాకు ఎంతో బాగా పాజిటివ్ టాక్ వస్తే గానే జనాలు థియేటర్లో చూడడానికి వెళ్లడం లేదు. ఎలాగూ ఓటీటీ లో సినిమా వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చు అని ఆలోచనతో కూడా చాలామంది థియేటర్స్ కు వెళ్లడం లేదు అనే చెప్పాలి. అయితే ఈ విషయంలో నిర్మాతలు చాలావరకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి పెద్ద సినిమాలకు వీలైనన్ని ఎక్కువ రోజులు థియేటర్లలోనే ఆడే విధంగా తెలుగు చిత్ర పరిశ్రమంలోని నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం.

    Tollywood top producers shocking decisions on ott releases

    ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే తప్పకుండా 50 రోజుల తర్వాత గాని ఓటీటీ విడుదల చేయవద్దు అని ఒక నియమాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే సురేష్ బాబు దిల్ రాజు అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మరికొంతమంది అగ్ర నిర్మాతలతో కూడా చర్చలు జరిపి త్వరలోనే అందరికీ ఇదే నియమం వర్తించే విధంగా చర్యలు తీసుకుపోతున్నట్లు సమాచారం.

    అయితే కొన్ని పెద్ద సినిమాలు కూడా థియేటర్లో విడుదలైన తర్వాత దారుణమైన ఫలితాన్ని అందుకుంటే ఓటీటీ అడ్వాన్స్ రిలీజ్ ద్వారా కొంత నష్టాల నుంచి తప్పించుకుంటున్నారు. చాలా వరకు ఓటీటీ సంస్థలు అలాంటి సినిమాలకు మంచి ఆఫర్లు ప్రకటించి నష్టాల నుంచి బయటపడే విధంగా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు 50 రోజుల విండో రిలీజ్ అంటే కొన్ని సినిమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ నియమాలు ఎంతవరకు కొనసాగుతాయో చూడాలి.

    English summary
    Tollywood top producers shocking decisions on ott releases
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X