టాప్ 10 గ్యాంగ్ స్టర్, మాఫియా వెబ్ సిరీస్ లు మీరు చూశారా? IMDB లో టాప్ రేటింగ్ ఇవే!

భారీ బడ్జెట్ చిత్రాలు, గ్రాండ్ వీఎఫ్ఎక్స్ కలిగిన సినిమాలకు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అవుతుంటారో..... వెబ్ సిరీస్ లకు కూడా అంతే ఆకర్షితులవుతున్నారు. ఓటీటీ ఎరా ప్రారంభమైన తర్వాత సిరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది. భాష ఏదైనా కంటెంట్, టేకింగ్, ట్విస్ట్ లు కలిగి ఉంటే మాత్రం ఆడియెన్స్ పోటీ పడిమరి చూస్తున్న సంగతి తెలిసిందే. పైగా గ్యాంగ్ స్టర్ అండ్ మాఫియా సిరీస్ లకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. వారి కోసం టాప్ 10 గ్యాంగ్ స్టర్ అండ్ మాఫియా వెబ్ సిరీస్ లు, వాటి నేపథ్యం, ఎక్కడ చూడొచ్చనే విషయాలు తెలుసుకుందాం...

1. బ్రేకింగ్ బ్యాడ్

బ్రేకింగ్ బ్యాడ్.. అమెరికన్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరిస్.. క్రైమ్ డ్రామా, థ్రిల్లర్, బ్లాక్ కామెడీ, ట్రాజెడీ, సీరియల్ డ్రామాగా రూపొందింది. బ్రయాన్ క్రాన్స్టన్, అన్నా గన్, ఆరోన్ పాల్, డీన్ నోరిస్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. 17 ఏళ్ల కింద ఈ సిరీస్ ప్రారంభమైంది. 2013 వరకు మొత్తం ఐదు సీజన్లు వచ్చాయి. మొత్తం 52 ఎపిసోడ్స్ ఉన్నాయి. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీలో గ్యాంగ్ స్టర్ అండ్ మాఫియా నేపథ్యంలో అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సిరీస్ కు IMDB 9.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇది నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది.

Top 10 Gangster and Mafia web series Have you watched these are the top ratings on IMDB

2. ది వైర్

ది వైర్.. 2002 జూన్2న లో వచ్చిన అమెరికన్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. అమెరికన్ రచయిత, మాజీ పోలీసు రిపోర్టర్ డేవిడ్ సైమన్ కేబుల్ నెట్‌వర్క్ HBO కోసం ఈ సిరీస్ ను రూపొందించారు. మొత్తం ఐదు సీజన్లలో 60 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ క్రైమ్ డ్రామా, పోలీస్ ప్రొసీజరల్, రాజకీయ డ్రామా, ట్రాజెడీతో మిళితమై సాగింది. డేవిడ్ సైమన్ ఈ సిరీస్ ను క్రియేట్ చేశారు. ఐఎండీబీ సంస్థ 9.3 రేటింగ్ ఇచ్చింది. అమెజాన్ లో ఈ సిరీస్ ను చూడొచ్చు.

3. ది సోప్రానోస్

ది సోప్రానోస్.. గ్యాంగ్ స్టర్ కథలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇటాలియన్-అమెరికన్ మాబ్‌స్టర్ టోనీ సోప్రానో తన కుటుంబాన్ని మొత్తాన్ని ఎలా క్రైమ్ సంస్థగా మారుస్తాడోననేది లైన్. ఈ సిరీస్ లో మొత్తం ఆరు సీజన్లు, 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీనికి ఐఎండీబీ సంస్థ 9.2 రేటింగ్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Top 10 Gangster and Mafia web series Have you watched these are the top ratings on IMDB

4. పీకీ బ్లైండర్స్..

పీకీ బ్లైండర్స్.. స్టీవెన్ నైట్ ఈ సిరీస్ ను క్రియేట్ చేశారు. ఇది బ్రిటిష్ పీరియడ్ క్రైమ్ డ్రామా. బర్మింగ్‌హామ్‌లో కథ సాగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన పరిణామాలలో పీకీ బ్లైండర్స్ క్రైమ్ గ్యాంగ్ దోపిడీల గురించి తెలియజేస్తుంది. ఇదొక కల్పిత ముఠా. 1880 నుంచి 1920 బర్మింగ్ హోమ్ లోని యువకుల ముఠాపై సిరీస్ సాగుతుంది. దీనికి ఐఎండీబీ 8.7 రేటింగ్ అందింది. జీయో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

5. సన్స్ ఆఫ్ అనార్కి

సన్స్ ఆఫ్ అనార్కి... 2008 నుంచి 2018 వరకు సాగిన అమెరికన్ యాక్షన్ క్రైమ్ డ్రామా టీవీ సిరీస్ ఇది. సన్స్ ఆఫ్ అనార్కీ కథ కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీలోని కాల్పనిక పట్టణం చార్మింగ్‌లో సాగుతుంది. అక్కడ మోటార్ సైకిల్ క్లబ్ తో పాటు.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తి జీవితం. దీనికి ఐఎండీబీ 8.5 రేటింగ్ ఇచ్చింది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మొత్తం 7 సీజన్లు, 92 ఎపిసోడ్స్ ఉన్నాయి.

Top 10 Gangster and Mafia web series Have you watched these are the top ratings on IMDB

6.నార్కోస్

నార్కోస్.. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన అమెరికన్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్ ఇది. 2015 నుంచి 2017 వరకు మూడు సీజన్లుగా 30 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యింది. కొలంబియన్ మాదకద్రవ్య ఉగ్రవాది (నార్కో టెరర్రిస్ట్), డ్రగ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ గురించి దర్శకుడు క్రిస్ బ్రన్కాటో చక్కగా చిత్రీకరించారు. ఐఎండీబీ ఈ సిరీస్ కు 8.7 రేటింగ్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

7. బోర్డ్‌వాక్ ఎంపైర్

బోర్డ్‌వాక్ ఎంపైర్.. అమెరికన్ పీరియడ్ క్రైమ్ డ్రామా. 1920లో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో నిషేధ యుగం గురించి చిత్రీకరించారు. పొలిటిషన్స్, గ్యాంగ్ స్టర్ మధ్య సాగుతుందీ సిరీస్. ఐదు సీజన్లుగా 56 ఎపిసోడ్ లు విడుదల చేశారు. దీనికి ఐఎండీబీ సంస్థ 8.6 రేటింగ్ అందించింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీయో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

8. ఓజార్క్స్‌

ఓజార్క్స్‌... డ్రగ్ క్రైమ్, థ్రిల్లర్, ఎపిక్ సిరీస్ ఇది. ఒక ఫినాన్షియల్ అడ్వైసర్ తన కుటుంబాన్ని మనీ లాండరింగ్ కోసం చికాగో నుంచి మిస్కోరీ ఓజార్క్స్‌కు తరలిస్తాడు. ఒక డ్రగ్ డీలర్ కోసం పనిచేస్తాడనేది సారాంశం. ఐఎండీబీ ఈ సిరీస్ కు 8.5 రేటింగ్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ అందుబాటులో ఉంది. మొత్తం నాలుగు సీజన్లు, 44 ఎపిసోడ్స్ ఉన్నాయి.

Top 10 Gangster and Mafia web series Have you watched these are the top ratings on IMDB

9. గాడ్‌ఫాదర్ ఆఫ్ హార్లెం

1960లలో ఇటాలియన్, బ్లాక్ మాఫియాకు హార్లెమ్‌లో జరిగిన కథనే గాడ్ ఫాదర్ ఆప్ హార్లెం. ఇది 2019లోనే విడుదలైంది. మొత్తం మూడు సీజన్లు, 30 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ క్రైమ్ బేస్డ్ సిరీస్ కు ఐఎండీబీ 8.1 రేటింగ్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ అందుబాటులో ఉంది.

10. స్నోఫాల్

స్నోఫాల్... 1980లో అప్పుడే లాస్ ఎంజెల్స్ లో కొకైన్ ప్రారంభమవుతున్న రోజుల్లో డ్రగ్స్ అమ్మకంపై సిరీస్ కొనసాగుతుంది. క్రాక్ కొకైన్ ను అమ్మి డబ్బు పోగు చేసే వ్యాపారి జీవిత కథనే స్నోఫాల్. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మొత్తం ఆరు సీజన్లు, అరవై ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ కు 8.4 ఐఎండీబీ రేటింగ్ అందింది.

More from Filmibeat

Read more about: netflix amazon ott movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X