Netfilx ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే.. టాప్ 10 మూవీస్, సిరీస్‌లను మీరు చూశారా?
ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ హవా కొనసాగుతున్నది. థియేటర్‌లో కంటే ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు థియేటర్‌తోపాటు ఓటీటీలో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమాల వివరాల్లోకి వెళితే..
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల విషయానికి వస్తే.. నంబర్ 1 స్థానంలో జవాన్ (Jawan), 2 పొజిషన్‌లో మ్యాడ్ (Mad), ఆ తర్వాత స్థానాల్లో యంగ్ షెల్డాన్ (Young Sheldon), చంద్రముఖి 2 (Chandramukhi 2), ఫ్రెండ్ (Friends), షీ (She), వన్ పీస్ (One Piece), మిస్ చటర్జీ వర్సెస్ నార్వే (Mrs Chatterjee Vs Norway), నారుటో (Naruto) సినిమాలు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇక జవాన్ (Jawan) సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి తదితరుల ఫెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అన్ కట్ ఎడిషన్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన చిత్రాల్లో తెలుగు సినిమా మ్యాడ్ (MAD) రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఆలరిస్తున్నది. యువ నటీనటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియా గౌరీ రెడ్డి, గోపిక, అనంతిక తదితరులు నటించిన ఈ సినిమా టాప్ 2 స్థానంలో నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో టాప్ ట్రెండింగ్ నిలిచిన వాటిలో తమిళ చిత్రాలు గాడ్, చంద్రముఖి సినిమా మూడు, నాలుగు స్థానంలో ఉన్నాయి. జయం రవి, నయనతార, అశీష్ విద్యార్థి నటించిన ఈ సినిమాను ఆహ్మద్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక నాలుగో స్థానంలో లారెన్స్, కంగన రనౌత్ తదితరులు నటించిన మూవీ ఉంది.
డేవిడ్ క్రేన్, మార్తా కౌఫిమ్యాన్, జెన్నిఫర్ అనిస్టన్ తదితరులు నటించిన ఫ్రెండ్స్ (Friends) టెలివిజన్ సిరీస్, లాన్స్ బార్బర్ జో పెర్రీ, అన్నీ పోట్స్ , జిమ్ పార్సన్స్ తదితరులు నటించిన యంగ్ షెల్డాన్ (Young Sheldon) మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక తమన్నా భాటియా ప్రియుడు విజయ్ వర్మ, యువ హీరోయిన్ అదితి పొహాంకర్, కిషోర్ నాయక్ తదితరులు నటించిన షీ (She) కూడా ట్రెండింగ్ అవుతున్నాయి.

ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న మూవీస్‌లో వన్ పీస్ (One Piece) ఒకటి. ట్రెజర్ హంట్ నేపథ్యంగా ఈ సిరీస్ రూపొందింది, రాణి ముఖర్జీ నటించిన మిస్ చటర్జీ వర్సెస్ నార్వే (Mrs Chatterjee Vs Norway) చిత్రం తన కన్న పిల్లల కోసం నార్వే ప్రభుత్వంతో న్యాయపోరాటం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది., నారుటో (Naruto) విషయానికి వస్తే.. జపాన్‌కు చెందిన మాంగా కార్టూన్ సిరీస్. యువ నింజా ప్లేయర్ నారుటో జుమాకీ గురించి చెప్పే కథగా రూపొందింది.


Click it and Unblock the Notifications











