నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ 5 ట్రెండింగ్ లో ఉన్న మూవీస్
ప్రస్తుతం ఉన్న దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రతీ వారం ఈ ఓటిటిలో ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఓటిటిలో ట్రెండ్ అయ్యే సినిమాల లిస్టు ప్రతి వారం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అయితే ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
10. ఫైటర్
హృతిక్ రోషన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. ఈ హిందీ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ ఓటిటిలో మాత్రం ఇప్పటికీ టాప్ 10 లో ట్రెండ్ అవుతుండడం విశేషం.

9. లియో
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, త్రిష జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ మూవీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో లియో హిందీ వర్షన్ 9వ స్థానంలో ఉంది.
8. గాడ్జిల్లా మైనస్ వన్
2023 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ జపనీస్ మూవీ గాడ్జిల్లా మైనస్ వన్. గాడ్జిల్లా ఫ్రాంచైజీ లో 37వ చిత్రంగా తెరక్కెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్టులో ఇంకా 8వ స్థానంలోనే ఉంది.
7. ఆర్టికల్ 370
కాశ్మీర్లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీనే ఆర్టికల్ 370. ఈ సినిమాలో యామి గౌతమ్ ప్రధాన పాత్రను పోషించగా, ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో 7వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఆ తర్వాత మేడం వెబ్ 6వ స్థానంలో, ఎం3గాన్ 5వ స్థానంలో, సైతాన్ 4వ స్థానంలో, అట్లాస్ 3వ స్థానంలో, లపాటా లేడీస్ 2వ స్థానంలో, క్రూ మూవీ టాప్ 1లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే హీరమండీ ది డైమండ్ బజార్, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 1, డీమోన్ స్లేయర్, బ్రిడ్జర్టన్ సీజన్ 3, మమ్లా లీగల్ హై సీజన్ 1 టాప్ 5లో ట్రెండ్ అవుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











