Trending on Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. వీటిని మీరు చూశారా?

వరల్డ్ వైడ్ మంచి పాపులర్ అయినటువంటి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. మరి మన దేశంలో కూడా ఈ యాప్ నే ఓటిటి ప్రియులు అత్యధికంగా వాడుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ప్రైమ్ వీడియోలో సాలిడ్ ఇండియన్ కంటెంట్ కూడా అందించడంతో ప్రైమ్ వీడియోకి మంచి క్రేజ్ మన దగ్గర ఉంది. అయితే ప్రైమ్ లో పలు వెబ్ సిరీస్ లు సహా పలు చిత్రాలు ఎప్పటికప్పుడు కొత్త సరుకు ప్రైమ్ లో వస్తూనే ఉంటుంది.

అలా రీసెంట్ గా పలు చిత్రాలు కూడా యాడ్ కాగా ఇందులో మరి ప్రస్తుతం ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో ఆ కంటెంట్ అండ్ సినిమాలు ఏంటి టాప్ 10 లో ఉన్న ఆ సినిమాల్లో వీటిని తప్పకుండా చూడాల్సిందే అనేవి చూద్దాం. ఇక టాప్ 10 లో ఉన్న ఆ సినిమాలు ఏంటో చూస్తే, గరుడన్, శర్మాజీ కి బేటీ, సత్యభామ, సివిల్ వార్, మైదాన్, పీటీ సార్, ఆరంభం, హిట్ లిస్ట్, ఇంగ నాన్ థాన్ కింగు, చివరిగా ఆవేశం సినిమాలు వరుసగా టాప్ 1 నుంచి 10 చిత్రాలుగా ట్రెండ్ అవుతున్నాయి.

Top 10 Trending Movies on Amazon Prime Video Do not miss these movies

అయితే ఈ చిత్రాల్లో ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఒక్కసారైనా చూసే సినిమాలు ఏవన్నా ఉన్నాయి అంటే అవి హిందీ నుంచి "మైదాన్", మన తెలుగు నుంచి "ఆరంభం" అలాగే తమిళ్ నుంచి "గరుడన్" సినిమాలు అని చెప్పవచ్చు. కాగా మన తెలుగు సినిమా కోసం మొదటిగా చెప్పుకున్నట్టయితే కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నటుడు మోహన్ భగత్ నటించిన ఈ చిత్రాన్ని అజయ్ నాగ్ వి తెరకెక్కించాడు.

అయితే ఈ చిత్రాన్ని ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. డే జావు అనే కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ తరహా జానర్ లో తెరకెక్కించిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రథమార్థం కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఖచ్చితంగా మన తెలుగు నుంచి తప్పక ట్రై చేయాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం ఆరంభం ప్రైమ్ వీడియోలో టాప్ 7 లో ట్రెండ్ అవుతుంది.

Top 10 Trending Movies on Amazon Prime Video Do not miss these movies

ఇక దీనితో పాటుగా హిందీ నుంచి అయితే అజయ్ దేవగన్ నటించిన "మైదాన్" సినిమా కోసం చెప్పాలి. ఈ సినిమా బాలీవుడ్ సినిమాల నుంచి వచ్చిన స్పోర్ట్స్ డ్రామాస్ లో ఒక జెమ్ అని చెప్పొచ్చు. థియేటర్స్ లో అనుకున్న రేంజ్ హిట్ కాలేదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. మన హైదరాబాద్ కి చేసిన ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మెయిన్ గా ఆ ఎమోషన్స్ ప్రతి ఒకర్ని తప్పక కదిలిస్తాయి. కాగా ఈ సినిమా జస్ట్ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.

కాగా ఈ సినిమా టాప్ 5వ సినిమాగా ట్రెండ్ అవుతుండగా అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కించారు. ఇక నెక్స్ట్ సినిమా అయితే తమిళ్ లో మంచి హిట్ అయ్యిన ఇంటెన్స్ రూరల్ డ్రామా "గరుడన్" కోసం చెప్పాలి. కమెడియన్ టర్న్డ్ హీరో సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక సస్పెన్స్ యాక్షన్ జానర్ లో తెరకెక్కింది. దీనిని ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా ఈ సినిమా తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే ప్రస్తుతం ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. సో ఈ మూడు సినిమాలు రీసెంట్ గా అప్డేట్ చేసినవి వీటిని వీకెండ్ కి ఎంజాయ్ చేయవచ్చు.

More from Filmibeat

Read more about: amazon prime video aavesham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X