OTT: ఇండియాలో టాప్ 10 సిరీసులివే... ఈ వీకెండ్‌లో ఏది చూడాలనుకుంటున్నారు?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల సినీ తారాలపై, సినీ విషయాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏంటి అనే దానిపై సర్వ నిర్వహించింది. దీనికి సంబంధించిన తాజా లిస్టును తన సోషల్ మీడియా ఖాతా వేదిగా విడుదల చేసింది. అయితే ఆ టాప్ 10 వెబ్ సిరీసుల్లో ఏ ఏ సిరీసులు ఉన్నాయి... వాటిలో ఏ ఏ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయనే దానిపై ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కరోనా తర్వాత ఎక్కువగా సినీ ప్రేక్షకులు అంతా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నారు. కొన్ని ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల కోసం డైరెక్టుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీసులు కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ నెలలో ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ లిస్టును ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ రిలీజ్ చేసింది.

ఆ లిస్టులో టాప్ 1లో ది రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. మాధవన్ నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. భూపాల్ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఈ సిరీసును తెరకెక్కించారు. ఇక ఈ సీరిసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక టాప్ 2లో ఆర్య సీజన్ 2 ఉంది. సుస్మీతా సేన్ నటించిన ఈ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 3లో ఆస్పిరెంట్స్ సీజన్ 2 ఉంది. ఈ సీరిస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 4లో లోకీ సీజన్ 2 ఉంది. ఇది హాలీవుడ్ సిరీస్ అయినప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక టాప్ 5లో స్కామ్ 2003 ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. స్కామ్ సీజన్ కు సీక్వెల్ గా ఈ సీజన్ తెరకెక్కింది. ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. టాప్ 6లో కాలా పానీ వెబ్ సిరీస్ ఉంది. ఇది నెట్ ఫ్లిక్స వేదికగా స్ట్రీమింగ్ ఉంది.

ఇక టాప్ 7లో అపూర్వ సిరీస్ ఉంది. ఇది డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 8 లో సుల్తాన్ ఆఫ్ దిల్లీ వెబ్ సిరీస్ ఉంది. ఇక ఈ సీజన్ కూడా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 9లో స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఉంది. ఇిది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 10లో పిప్పా ఉంది. మృణాల్ ఠాకూర్, ఇషాన్ కట్టర్ నటించిన దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవండి టాప్ 10 వెబ్ సిరీసుల లిస్ట్.


Click it and Unblock the Notifications











