OTT: సోనీ లివ్ ఓటిటిలో ట్రెండింగ్ సినిమాలు.. టాప్ 5 తెలుగు మూవీస్ మీరు చూశారా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ ఓటీటీల్లో సోనీ లివ్ కూడా ఒకటి. అయితే మిగతా ఓటీటీల్లో ఉన్నట్టుగా ఇందులో తెలుగు కంటెంట్ పెద్దగా అవైలబుల్ గా ఉండదు. కానీ ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో ఉన్న బెస్ట్ టాప్ 5 తెలుగు మూవీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఇట్లు అమ్మ
సోనీ లివ్ లో ఉన్న టాప్ 5 తెలుగు సినిమాల జాబితాలో మొదటిది రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఇట్లు అమ్మ. మంచి థ్రిల్లర్, క్రైమ్ సినిమాలను చూసే మూడ్‌లో ఉన్నవాళ్లకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. సి. ఉమామహేశ్వర రావు దర్శకత్వం వహించి, రాసిన మూవీ ఇట్లు అమ్మ. ఈ చిత్రంలో రేవతి, పోసాని కృష్ణ మురళి, రవి కాలే, బొమ్మకు మురళి, మిహిరా, అరువి బాల కీలక పాత్రలు పోషించారు. బాలసరస్వతి అనే తల్లి తన 19 ఏళ్ల కొడుకు ఒక తుఫాను రాత్రి కత్తిపోట్లకు గురై మరణించిన తర్వాత ఆమె చేసే ప్రయాణంపై సాగే కథ. ఒక తల్లి తన కుమారుని చావుకు న్యాయం చేయాలంటూ ఒంటరిగా బయలుదేరినప్పుడు ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ కథాంశం సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది.

స్కైలాబ్
విశాక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామా స్కైలాబ్ అనే ప్రయోగాత్మక ల్యాబ్ బిల్ట్-ఇన్ స్పేస్ క్రాష్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం హాస్యభరితమైన రీతిలో స్కైలాబ్ కూలిపోతుందని భయపడే గ్రామస్తుల కథను చూపిస్తుంది. నిత్యా మీనన్ నటించిన స్కైలాబ్ 2021 డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైంది.
ఓకే ఒక జీవితం
ఒకే ఒక జీవితం 2022 సెప్టెంబర్ 9న రిలీజైన సైన్స్ ఫిక్షన్ మెలోడ్రామా. ఈ మూవీకి కార్తీక్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై నిర్మించారు. ఒకే ఒక జీవితం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్ హీరోగా నటించగా, అక్కినేని అమల ఆయన తల్లిగా కన్పించింది. హీరో గతంలో విషయాలను సెట్ చేయడానికి టైమ్ మెషీన్‌ను ఎలా రూపొందించాడు అనేదే స్టోరీ. ఈ మూవీకి థియేటర్లలో మంచి స్పందన వచ్చింది.

ఆకాశవాణి
అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ఆకాశవాణి మూవీ చీమలు దూరని చిట్టడవిలో రేడియోను మాట్లాడే దేవుడిగా భావించే ఆంధ్ర ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలోని గిరిజన ప్రజల కథ. బయట ప్రపంచం గురించి, ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి పూర్తిగా తెలియని గిరిజన సమూహానికి రేడియో కన్పిస్తే ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా మేకర్స్ 2021 సెప్టెంబర్ 24న సోనీలైవ్‌లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు.
రామారావు ఆన్ డ్యూటీ
2022లో విడుదలైన ఈ తెలుగు యాక్షన్ సినిమా కథ వ్యవస్థలోని లోపాలతో పోరాడేందుకు రూల్స్ ను అధిగమించే ప్రభుత్వ అధికారి రామారావు చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2022 జూలై 29న థియేటర్లలో విడుదలైంది. రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించగా, డిజాస్టర్ గా మిగిలింది.


Click it and Unblock the Notifications











