Top 5 Web Series: ఓటీటీలో టాప్ ట్రెండింగ్ 5 వెబ్ సిరీస్ లు ఇవే.. మీరు చూసారా?
కరోనా సమయంలో ఇండియాలో బాగా పాపులరైంది ఓటీటీ. ఇంట్లోనే ఉండి ప్రపంచ నలుమూలలకు చెందిన ఏ సినిమా, వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్‌ను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. నాటి నుంచి మనదేశంలో ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌లను శాతం ఓటీటీ సంస్థలు శాసించే స్థాయికి చేరుకున్నాయి. రోజు రోజుకు మనదేశంలో ఓటీటీలను వీక్షించే వారి సంఖ్య, ఓటీటీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రేక్షకులకు వల వేస్తున్నాయి. మనదేశంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతూ ఉంటాయి. అయితే వీటీలో కొన్ని మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఇలా ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు ఏంటీ? ఇండియాలో ప్రస్తుతం టాప్ 5లో ఉన్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటీ? అన్న దానిపై ఆర్మాక్స్ సర్వే చేపట్టింది. ఈ ఏడాది జూలై 21 నుంచి 27 వరకు ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో టాప్ 5ని ఎంపిక చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

సర్జమీన్:
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీఖాన్, బొమన్ ఇరానీ, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకు కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 25న ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజై విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ సినిమాను ఇప్పటి వరకు 4.5 మిలియన్ల మంది వీక్షించగా లిస్ట్‌లో సర్జమీన్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.
కుబేర:
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్మ రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా కుబేర చిత్రాన్ని నిర్మించారు. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలకపాత్రలు పోషించారు. జూన్ 20న కుబేర సినిమా థియేటర్లలో రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది. జూలై 18న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇప్పటి వరకు 3.7 మిలియన్ల మంది వీక్షించడంతో టాప్ 5 ఓటీటీ మూవీస్‌లో రెండో స్థానంలో నిలిచింది.
రోంత్:
దిలీశ్ పోతన్, రోషన్ మ్యాథ్యూ, అరుణ్ చేరుకవిల్, రోషన్ అబ్ధుల్ రవూఫ్ కీలకపాత్రలు పోషించిన మలయాళ చిత్రం రోంత్. షాహిల్ కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జంగీల్ పిక్చర్స్ ఫెస్టివల్ సినిమాస్ బ్యానర్‌పై వినీత్ జైన్, రతీష్ అంబట్, రెంజిత్ ఈవీఎం, జోజో జోష్‌లు నిర్మాణం వహించారు. జూన్ 13న రోంత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. జూలై 22న రోంత్ సినిమా జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పటి వరకు 2.4 మిలియన్ల మంది వీక్షించారు.
ఆప్ జైషా కోయి:
ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్, మనీష్ చౌదరి, ఆయేషా రజా, నమిత్ దాస్, కరణ్ వాహి తదితరులు కీలకపాత్ర పోషించిన ఆప్ జైషా కోయి చిత్రాన్ని వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా సంయుక్తంగా నిర్మించారు. జూలై 11న ఆప్ జైషా కోయి నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఓటీటీలో 2 మిలియన్ల మంది వీక్షించారు. లిస్ట్ లో ఈ సినిమా 4వ స్థానంలో నిలిచింది.
డీఎన్ఏ:
అథర్వ, నిమిషా సజయన్, మహమ్మద్ జీషన్, అయూబ్‌లు కీలకపాత్ర పోషించిన చిత్రం డీఎన్ఏ. నెల్సన్ వెంకటేషన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఒలంపియా మూవీస్ బ్యానర్‌పై జయంతి అంబెత్ కుమార్, ఎస్ అంబెత్ కుమార్‌లు నిర్మాణం వహించారు. జూన్ 20న డీఎన్ఏ సినిమా థియేటర్‌లలో విడుదల కాగా.. జూలై 19న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న డీఎన్ఏ మూవీని ఓటీటీలో ఇప్పటి వరకు 1.3 మిలియన్ల మంది వీక్షించారు. దాంతో టాప్ 5 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో డీఎన్ఏ సినిమా 5వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











