OTT: అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 10 ట్రెండింగ్ యాక్షన్, కామెడీ సినిమాలివే! మీరూ చూసారా?

ఈ ఏడాదిలో మన దేశంలో కూడా పలు స్ట్రీమింగ్ సంస్థలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రతీ వారం అప్డేట్ చేస్తూ వస్తున్నారు. అలా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి పాపులర్ స్ట్రీమింగ్ సంస్థలు సాలిడ్ సినిమాలు వెబ్ సిరీస్ లు తీసుకొస్తున్నారు. కాగా వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా మంచి సినిమాలు వరల్డ్ వైడ్ గా ఆయా భాషల్లో తీసుకోచ్చారు. మరి ఇవి తీసుకు రావడంతోనే మన దేశంలో కూడా ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే అలా టాప్ 10 ట్రెండింగ్ లోకి వచ్చిన చిత్రాల్లో యాక్షన్ మరియు కామెడీ జానర్ లలో ఉన్న సినిమాలు ఏంటో వాటి డీటెయిల్స్ ఒక లుక్ వేద్దాం.

మొదటిగా మన టాలీవుడ్ నుంచే మొదలు పెడితే స్టేర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన రీసెంట్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "సత్యభామ" ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమాని దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించారు. అయితే ఈ సినిమా యాక్షన్ అండ్ కాజల్ అభిమానులకి మంచి ఫీస్ట్ గా మారింది. ఓటిటిలో వచ్చాక ఈ సినిమాకి డీసెంట్ టాక్ రావడం విశేషం.

top action and comedy genre movie now in prime video trending

ఇక ఈ చిత్రం తర్వాత కోలీవుడ్ రీసెంట్ హిట్ సినిమా "పీటీ సార్" కూడా ట్రెండ్ అవుతుంది. యంగ్ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా హీరోగా చేసిన మరో సినిమా ఇది కాగా ఈ చిత్రాన్ని కార్తీక్ వేణు గోపాలన్ దర్శకత్వం వహించారు. కాగా ఇది మంచి కామెడీ డ్రామాగా వచ్చి థియేటర్స్ లో అలరించగా ఇప్పుడు ఓటిటిలో కూడా ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా ట్రెండింగ్ లో ఉంది.

ఇక ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న మరో కామెడీ సినిమా కూడా చూస్తే ఇది కూడా తమిళ్ నుంచే ఉండగా ప్రముఖ కమెడియన్ సంతానం నటించిన చిత్రం "ఇంగ నాన్ తాన్ కింగు" అనే సినిమా ట్రెండ్ అవుతుంది. ఓ కుటుంబం అంతా ఓ మర్డర్ కేసులో ఇరుక్కోగా ఈ నెక్స్ట్ జరిగే అంశాలు మంచి ఫన్నీగా ఎలా సాగాయి అనే కోణంలో దర్శకుడు ఆనంద్ నారాయణన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రైమ్ లో ట్రెండ్ అవుతుంది. కాగా ఈ చిత్రం తమిళ్ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది.

top action and comedy genre movie now in prime video trending

దాని తర్వాత మరో కామెడీ ఫ్యామిలీ డ్రామా చూసినట్టు అయితే హిందీ నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమా "శర్మా జి కి బేటీ" ట్రెండింగ్ లో నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని తహిర కశ్యప్ ఖురానా దర్శకత్వం వహించగా ఓ శర్మ కుటుంబంలో ఉండే ముగ్గురు అమ్మాయిలు వారి లైఫ్ లో జరిగే ఫన్ అండ్ ఎమోషన్స్ తో సాగుతుంది అని చాలా కాలం తర్వాత హిందీ సినిమా నుంచి ఓ మంచి ఫన్ అండ్ ఎమోషన్స్ ఉన్న సినిమా చూశామని నెటిజన్స్ కూడా అంటున్నారు. మరి ఈ సినిమా కూడా ప్రైమ్ లో ట్రెండింగ్ లో నిలిచింది.

ఇక యాక్షన్ సినిమాల్లో మరో తెలుగు సినిమా ఆనంద్ దేవరకొండ నటించిన "గం గం గణేశా" కూడా ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రాన్ని ఉదయ్ బొమ్మి శెట్టి ఒక రాబరీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక మరికొన్ని యాక్షన్ సినిమాలు చూసినట్టు అయితే హాలీవుడ్ నుంచి రెండు సినిమాలు ప్రైమ్ లో ట్రెండ్ అవుతున్నాయి. కాగా వీటిలో జస్ట్ కొన్ని రోజులు కితమే ప్రైమ్ లో రిలీజ్ అయ్యిన అమెరికన్ యాక్షన్ మూవీ "సివిల్ వార్" ఇండియా వైడ్ టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది.

top action and comedy genre movie now in prime video trending

ఫ్యూచర్ అమెరికాలో జరిగే యుద్ధ నేపథ్యలో దర్శకుడు అలెక్స్ గార్లాండ్ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్ మూవీస్ ని ఇష్టపడేవారికి అయితే ప్రైమ్ వీడియోలో మంచి ట్రీట్ ఇస్తుంది. కాగా ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇక దీనితో పాటుగా మరో సినిమా "ఫ్రీలాన్స్" ట్రెండ్ అవుతుంది. 2023లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇటీవల ప్రైమ్ విడియోలోకి స్ట్రీమింగ్ కి రాగా ఇందులో ప్రముఖ రెజ్లర్ హాలీవుడ్ నటుడు జాన్ సీనా నటించాడు.

కాగా ఈ చిత్రంని పైరే మోరెల్ దర్శకత్వం వహించగా ఇది యాక్షన్ తో పాటు కామెడీ జానర్ సినిమాగా వచ్చి ఇండియా వైడ్ టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా తెలుగులో అందుబాటులో ఉంది. మరి ప్రస్తుతానికి అయితే ఈ సినిమాలు ప్రైమ్ వీడియోలో యాక్షన్, కామెడీ జానర్ లని ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఎలాగో ఓటీటీ వీక్షకులకు ఎలాగో భాషా బేధం లేదు కాబట్టి అన్ని సినిమాలను చూడాలి అనుకునేవారు చూడొచ్చు.

More from Filmibeat

Read more about: ott amazon prime video satyabhama
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X