OTT డిస్నీ హాట్‌స్టార్‌లో టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లో.. వీటిలో మీరెన్నీ చూశారు?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీలలోనే విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లలో టాప్ టెన్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సినిమాలు సిరీస్ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

భీమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ హీరోగా నటించినటువంటి సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ట్రెండింగ్లో కొనసాగుతోంది.

Top ten films and web series in disney hotstar full details inside

సైరన్: జయం రమేష్ కీర్తి సురేష్ అనుపమ పరమేశ్వరన్ సముద్రఖని వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినటువంటి సైరన్ చిత్రం తమిళంలో మంచి సక్సెస్ అందుకొని తెలుగులో కూడా ఫిబ్రవరి 23న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ టెన్ లో కొనసాగుతుంది.

సేవ్ ది టైగర్ 2: యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ డైరెక్షన్లో వచ్చిన సేవ్ ది టైగర్ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సిరీస్ కి రెండో భాగంగా సేవ్ ది టైగర్స్2 ఇటీవల విడుదల అయితే ఎంత మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ ట్రెండ్ వెబ్ సిరీస్ గా కొనసాగుతుంది. ఇందులో ప్రియదర్శి గంగవ్వ జబర్దస్త్ సుజాత వంటి వారు కీలక పాత్రలో నటించారు.

లూటర్: లూటర్ అనే వెబ్ సిరీస్ ఇటీవల హాట్ స్టార్ లో విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్ సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను బందిపోటులు బంధిస్తే వారిని ఎలా హీరో కాపాడారు అనే నేపథ్యంలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ సైతం టాప్ టెన్ లో ఒకటిగా కొనసాగుతోంది.

Top ten films and web series in disney hotstar full details inside

మంజుమ్మెల్‌ బాయ్స్‌: 2024లో తెలుగు విడుదలైన ఈ సినిమా మలయాళీ సినిమా. ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైనటువంటి సక్సెస్ అందుకోవడంతో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే తెలుగులో ఈ సినిమాకు ఇతర భాషలలో వచ్చినంత క్రేజ్ రాలేదని చెప్పాలి ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రావడమే కాకుండా టాప్ లో ఫ్రెండ్ అవుతుంది.

లవర్: తమిళ చిత్ర వర్షంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తెలుగులో అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలా తెలుగులో థియేటర్లలో విడుదలైనటువంటి సినిమా మాత్రం హాట్ స్టార్ లో టాప్ టెన్ లో ట్రెండ్ అవుతూ ఉంది .

డోరమాన్: డోరేమాన్ అనే కార్టూన్ సిరీస్ చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అయితే ప్రస్తుతం హాలిడేస్ కావడంతో ఈ సిరీస్ సైతం టాప్ టెన్ లో ట్రెండ్ అవుతుంది.

చిన్ చాన్: పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కార్టూన్ చిన్ చాన్ సిరీస్ సైతం హాట్ స్టార్ లో టాప్ ట్రెండ్ నడుస్తోంది.

స్కంద: హీరో రామ్ బోయపాటి దర్శకత్వంలో నటించిన మాస్ యాక్షన్ చిత్రం స్కంద సినిమా థియేటర్లలో పెద్దగా ఆశించిన ఫలితాలు అందుకో లేకపోయిన డిజిటల్ మాధ్యమాలలోను టీవీలోనూ మంచి సక్సెస్ అందుకుంది అయితే ఊహించిన విధంగా ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ టెన్ లో కొనసాగుతోంది.

Top ten films and web series in disney hotstar full details inside

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించినటువంటి RRR సినిమా ఆస్కార్ అవార్డును అందుకొని సంచలనాలను సృష్టించింది.అయితే తాజాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ టెన్ లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X