Tourist Family On OTT: 70 కోట్లు కొల్లగొట్టిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీలోకి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
తమిళ సినిమా పరిశ్రమలో సీనియర్ హీరో, హీరోయిన్లు సిమ్రాన్, శశికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. అభిషాన్ జీవింత్ అనే నూతన దర్శకుడు రూపొందించిన చిత్రంలో యోగిబాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని నజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మే 1వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాల్లోకి వెళితే..
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కథ విషయానికి వస్తే.. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత శ్రీలంక తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాయింట్ ఆధారంగా కామెడీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. ఓ తమిళ మధ్య తరగతి కుటుంబం శ్రీలంకలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలను బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలోని కంటెంట్‌ను సమాజాన్ని ఆలోచించే అంశాలతో రూపొందించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వ్యక్తమైంది.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను కేవలం 35 రోజుల్లో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, మూవీ ప్రమోషన్స్ ఖర్చులు అన్నీ కలిపి ఈ మూవీని సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 8 కోట్ల రూపాయల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్‌గా బాక్సాఫీస్ ప్రయాణం చేపట్టింది.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కేవలం తమిళ భాషల్లోనే రిలీజైంది. ఈ సినిమా వివిధ రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి వారం ఈ చిత్రం తమిళనాడులో 20 కోట్ల రూపాయలు, కన్నడలో 1.5 కోట్ల రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయలు, కేరళలో 50 లక్షలు రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 23 కోట్ల రూపాయలకుపైగా తొలివారం వసూలు చేసింది.
ఇక మౌత్ టాక్ పెరగడంతో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం రెండోవారంలో బాక్సాఫీస్ వద్ద పుంజుకొన్నది. ఈ సినిమా తమిళనాడులో 26 కోట్లు, కన్నడలో 2.25, తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షలు, కేరళలో 70 లక్షలు, ఇతర రాష్రాల్లో 28 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. మూడో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించి అదనంగా మరో 11 కోట్లు రాబట్టింది. ఇక గత 29 రోజుల్లో మొత్తంగా 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలోనే ఈ సినిమా 60 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సూర్య నటించిన రెట్రో కలెక్షన్లను అధిగమించింది.
అయితే సినీ క్రిటిక్స్, ట్రేడ్ వర్గాల అంచనాలు మించి కలెక్షన్లను సాధించిన చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకోకుండానే.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. తమిళంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా రోజుకు కోటి రూపాయల కలెక్షన్లు సాధిస్తున్నది. అయితే.. జియో హాట్ స్టార్‌తో ఉన్న ఒప్పందం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది.అయితే తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో అందుబాటులో ఉంటుందా? అనేది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











