బాక్సాఫీస్ వద్ద 100 కోట్లతో సంచలనం .. ఓటీటీలోకి కృతిశెట్టి మూవీ.. ఎప్పుడు, ఎందులో అంటే?
యాక్షన్ , సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ తరహా సినిమాలు తీయడంలో మలయాళీలది అందె వేసిన చేయి. దేశంలోని అన్ని ఇండస్ట్రీలు ఈ జోనర్‌లో సినిమాలు చేస్తున్నా.. మలయాళీలది డిఫరెంట్ స్టైల్. కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీల ద్వారా మలయాళ సినిమాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో టావినో థామస్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ ఓటీటీలోకి రానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
వెరైటీ కథలతో అభిమానులను సంపాదించుకున్నారు థామస్. మిన్నల్ మురళి, 2018 చిత్రాలు డబ్ కావడంతో తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ పెరిగింది. థామస్ నటించిన 50వ చిత్రమే ఏఆర్ఎం (అజయంతే రండమ్ మోషనమ్) తెలుగులో అజయన్ చేసిన రెండో దొంగతనం. ఈ సినిమాలో కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ, బసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలకపాత్ర పోషించగా.. జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై లిజిన్ స్టీఫెన్, జక్రయా థామస్‌లు నిర్మించారు.

సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా పైరసీ రక్కసి బారినపడింది. ఈ మూవీ పైరసీ వెర్షన్‌ను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో చూస్తున్న వీడియోను దర్శకుడు జితిన్ లాల్ సెప్టెంబర్ 17న బయటపెట్టడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న కేరళ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇడుక్కి మహారాజుకు బ్రిటీష్ వారి వల్ల కష్టం వస్తుంది. కుంజి కేలు అనే యోధుడు (టొవినో థామస్) ఆ రాజును కాపాడుతాడు. తనను రక్షించినందుకు గాను శ్రీబోది దీపం (విగ్రహం)ను కేలీకి బహుకరిస్తాడు మహారాజు. ఇడుక్కి మహారాజును బ్రిటీష్ వారి నుంచి కుంజు కేలు ఎలా కాపాడాడు. శ్రీబోది విగ్రహాన్ని ఇచ్చినప్పటికీ కేలుని ఆ మహారాజు చేసిన మోసం ఏమిటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఆ రాజ వంశానికి కేలీ కుమారుడు మణియన్ (టొవినో థామస్) ఎలాంటి గుణపాఠం నేర్పాడు? శ్రీ బోది దీపం వల్ల మణియన్ ఎలా ప్రాణాలు కోల్పోయాడు? తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి అజయన్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అజయన్ చేసిన మొదటి దొంగతనం ఏమిటి? రెండో దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే అజయంతే రాండమ్ మోషనమ్ (ఏఆర్ఎం) సినిమా కథ.
#Malayalam Movie #ARM will be Streaming from 8th November on #DisneyPlusHotstar in Malayalam, Tamil, Hindi, Telugu & Kannada Audios #ARMOnHotstar #TovinoThomas #KrithiShetty #SurabhiLakshmi #AishwaryaRajesh#BasilJoseph pic.twitter.com/XHzI7ylyeA
— OTT Streaming Updates Reviews (@gillboy23) November 2, 2024
థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఏఆర్ఎం మూవీ తాజా ఓటీటీ రిలీజ్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 8 నుంచి ఏఆర్ఎం మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని డిస్నీ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











