50 కోట్ల కలెక్షన్స్‌తో సంచలనం.. ఓటీటీలోకి త్రిష క్రైమ్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ అప్పుడేనా?

వెండితెరపై దాదాపు 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష. ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు కానీ ఆమె మాత్రం ఇప్పటికీ స్టార్‌గానే వెలుగొందుతున్నారు. త్రిష కాల్షీట్ల కోసం ఇప్పటికీ దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. మరోవైపు ఆమె రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని? త్వరలోనే ఓ పార్టీలో చేరి కొద్దినెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ గత కొద్దిరోజులగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వయసు , ఇమేజ్ దృష్ట్యా చాలా సెలెక్టివ్‌గానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు త్రిష. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే త్రిష నటించిన చిత్రం ఐడెంటిటీ. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అఖిల్ పౌల్, అన్సాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. రాగం మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్‌ బ్యానర్‌పై రాజు మల్లియత్, రాయ్ సీజేలు ఈ సినిమాను నిర్మించారు.

Tovino Thomas and trisha krishnan starrer Identity Movie Now streaming on ZEE 5

న్యూ ఇయర్ కానుగా జనవరి 2న తమిళ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మూడు వారాల థియేట్రికల్ రన్‌లో మలయాళంలో రూ.9 కోట్ల నెట్, 18 కోట్ల గ్రాస్.. తమిళంలో రూ. 1.5 కోట్ల నెట్, రూ. 3 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 26 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2025ని భారీ విజయంతో ఆరంభించారు త్రిష.

తమిళ్, మలయాళంలలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం జనవరి 24న విడుదల చేశారు. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్ఫణలో శ్రీవేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తెలుగులో ఐడెంటిటీ నిర్మాతగా వ్యవహరించారు. ఇక్కడా వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tovino Thomas and trisha krishnan starrer Identity Movie Now streaming on ZEE 5

ఐడెంటిటీ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారికంగా అనౌన్స్ చేశారు. ఐడెంటిటీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకోగా.. జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం నెల రోజుల గ్యాప్‌లోనే ఈ సినిమ ఓటీటీలోకి అందుబాటులోకి రావడం గమనార్హం. తొలుత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాగా.. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడనేది ఇంకా తెలియరాలేదు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఆస్వాదించండి.

More from Filmibeat

Read more about: tovino thomas trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X