Amazon Prime Video అమెజాన్‌లో ట్రెండింగ్‌లో అవుతున్నవి ఇవే.. టాప్ 10 మూవీస్ మీరు చూశారా?
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందరికీ అందుబాటులో ఉన్న వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. గత ఐదేళ్లలో సబ్‌స్రైబర్స్ పరంగా, కంటెంట్ పరంగా గణనీయమైన వృద్ధిని సాధించింది. ఎంతో మందిని తన సబ్‌స్క్రైబర్లుగా మార్చుకొని ముందుకెళ్తున్నది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ లేపుతూ ట్రెండింగ్‌గా నిలిచిన వెబ్ సిరీస్, సినిమాల వివారాల్లోకి వెళితే..
టాప్ 10 జాబితాలో Raththam Movie: దక్షిణాది నటుడు విజయ్ ఆంటోని నటించిన రథమ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 10వ నంబర్ స్థానంలో కొనసాగుతున్నది. సీఎస్ అముధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహిమా నంబియార్, నందితా శ్వేత, రెమ్యా నంబీసన్, నిళగల్ రవి, తదితరులు నటించారు. అక్టోబర్ 6వ తేదీన థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ఓటీటీలో వచ్చి స్ట్రీమింగ్ అవుతున్నది.

8, 9 స్థానాల్లో ట్రెండింగ్‌గా: కన్నడ స్టార్ హీరో గణేష్, రుక్మిణి వసంత్, రీష్మా నన్నయ్య, రంగయాన రఘు నటించిన బానదారియాలీ మూవీ అమెజాన్‌లో 9వ స్థానంలో ఉంది. ప్రీతమ్ గుబ్బి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ ప్రభు హీరోగా లక్ష్మీ మీనన్, మీనాల్ తదితరులు నటించిన పిల్లికుత్తి పాండి చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చి అమెజాన్‌లో 8వ స్థానంలో ట్రెండ్ అవుతున్నది.

7వ స్థానంలో రణ్‌వీర్, ఆలియా మూవీ: రణ్‌వీర్ కపూర్, అలియా భట్, ధర్మేంద్ర, షబానా ఆజ్మీ తదితరులు నటించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీన రిలీజైంది. కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ 7వ స్థానంలో నిలిచింది.

5, 6 స్థానాల్లో ఉన్నవి ఇవే: ఆంథోని రామోస్, పీట్ డేవిడ్సన్, లిజా కోషీ తదితరులు నటించిన ట్రాన్స్‌ఫార్మర్: రైస్ ఆఫ్ ది బీట్స్ చిత్రం జూన్ 9వ తేదీన రిలీజై 440 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ 6వ స్థానంలో ఉంది. టేకేషిస్ క్యాజిల్ ఇండియా వెబ్ సిరీస్ విశేషంగా ఓటీటీ అభిమానులను ఆకట్టుకొంటున్నది. టకేషి కిటానో ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరించారు. మొత్తం 133 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ 5వ స్థానంలో ఉంది.

రజనీకాంత్ 4వ స్థానంలో: రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. సుమారు 600 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన రిలీజైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాప్ 4స్థానంలో నిలిచింది. గత కొద్దికాలంగా ఓటీటీలో కూడా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది.

టాప్ 1, 2, 3 స్థానాల్లో: అమెజాన్‌లో టాప్ 3 స్థానాల్లో నిలిచిన వాటిలో పిప్పా, పీఐ మీనా, యాస్పిరెంట్స్ ఉన్నాయి. మృణాల్ థాకూర్, ఇషాన్ కట్టర్ నటించిన పిప్పా మూవీ నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పీఐ మీనా వెబ్ సిరీస్‌లో సౌరవ్ దాస్, సవోన్ చక్రవర్తి, తాన్య మానిక్‌తలా నటించారు. ఈ వెబ్ సిరీస్ 2వ స్థానంలో నిలిచింది. యాస్పిరెంట్స్ వెబ్ సిరీస్‌లో నమితా దుబే, నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ 3వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











