OTT: ఓటీటీలోకి త్రిషా కృష్ణన్ ఎంట్రీ.. తొలి వెబ్ సిరీస్ ఎక్కడ రిలీజ్? ఎప్పటి నుంచి అంటే?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి రంగంలో దాదాపు అన్ని ఇండస్ట్రీ తాలూకా బిగ్ స్టార్స్ అంతా తమ సినిమాలతో పాటుగా డిజిటల్ డెబ్యూ లని కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇందులో కేవలం హీరోయిన్ తరహా రోల్స్ కాకుండా డైరెక్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సిరీస్ లని చేస్తున్నారు.
అలా మన సౌత్ స్టార్ హీరోయిన్స్ లో అయితే తమన్నా, సమంత, అమలా పాల్ లాంటి బ్యూటీస్ పలు ఓటిటి సిరీస్ లతో తమ డిజిటల్ డెబ్యూ లని అందించగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ అయితే చాలా కాలం నుంచి ఊరిస్తున్న వస్తున్నా తన ఓటిటి సిరీస్ తో రాబోతుంది. మరి ఆ స్టార్ హీరోయినే త్రిష కృష్ణన్ కాగా ఆ సిరీస్ నే "బృంద".

త్రిష తమిళ్ నటి అయినప్పటికీ ఆమె తెలుగులో ఓటిటి ఎంట్రీని సెట్ చేసుకుంది. కానీ ఈ సిరీస్ ఎప్పుడో 2021 లో మొదలు పెడితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత స్ట్రీమింగ్ కి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. కాగా ఈ సిరీస్ ని సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించగా ఇదొక థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది.
కాగా ఈ సిరీస్ ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ వారు ఎక్స్ క్లూజివ్ గా తీసుకోగా ఈ సిరీస్ ని ఈ ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసేసారు. సో ఇన్నేళ్ల తర్వాత త్రిష డిజిటల్ డెబ్యూ రాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ సిరీస్ లో త్రిష మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించనుంది. అలాగే నటి ఆమని జయప్రకాశ్ లాంటి స్టెల్లార్ కాస్ట్ ఈ సినిమాలో ఉన్నారు.

ఇక త్రిష ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాదిలో విజయ్ తో చేసిన "లియో" తో భారీ కం బ్యాక్ ని ఆమె అందుకోగా ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన మళ్ళీ 'స్టాలిన్' తర్వాత "విశ్వంభర" అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతే కాకుండా ఇపుడు మళ్ళీ ఆమె పాత రోజుల్లా తెలుగు సహా తమిళ్ ఇండస్ట్రీస్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.
కాగా విశ్వంభర సినిమాని యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో త్రిష మాత్రమే కాకుండా ఆషిక రంగనాథ్, సురభి పురాణిక్ కూడా నటిస్తున్నారు. అలానే మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











