ఓటీటీలోకి 70 కోట్ల కలెక్షన్ల యాక్షన్, కామెడీ మూవీ.. మమ్ముట్టి సినిమా ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన టర్బో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధించింది. కన్నడ దర్శకుడు రాజ్ బీ శెట్టి, తెలుగు కమెడియన్, నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించగా, అంజనా జయప్రకాశ్, అమీనా నిజం, నిరంజనా అనూప్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు ముఖ్య రోల్స్‌లో కనిపించారు. మే 23వ తేదీన రిలీజైన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ముగించుకొని ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిన టర్బో సినిమాను స్వయంగా మమ్ముట్టి తన సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీపై నిర్మించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే థియేట్రికల్‌గా ఈ సినిమాకు మలయాళంలో మంచి అప్రిషియేషన్ లభించింది.

ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్‌లో మలయాళంలో 33 కోట్లు నికరంగా, 39 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సస్‌లో ఈ చిత్రం 31 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను కూడా తెచ్చిపెట్టింది.
టర్బో సినిమాకు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ మూవీ హక్కులు అత్యధిక రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఫ్యాన్సీ ధరను చెల్లించి ఈ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది. ఈ చిత్రాన్ని అనుకొన్న గడువు కంటే ముందే స్ట్రీమింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇక మలయాళం ఇండస్ట్రీలో ఏదైనా మూవీ రిలీజ్ అయినా తర్వాత 8 వారాల అనంతరం ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే ఆ రూల్ ప్రకారం ఈ చిత్రం జూలై తొలివారంలో గానీ.. లేదా రెండోవారంలో గానీ అంటే.. జూలై 5వ తేదీన గానీ, జూలై 12వ తేదీన గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ముందే రిలీజ్ అయితే.. జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్ కావడానికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications