Bigg Boss Non Stop finale లో గొల్టెన్ సూట్ కేసు ట్విస్టు.. బుట్టలో ఎవరు పడ్డారంటే?
బిగ్‌బాస్ రియాలిటీ షో అంటేనే ట్విస్టులు, టర్న్స్‌తో ప్రేక్షకులను ఉత్తేజానికి గురిచేస్తుంటుంది. అయితే తొలిసారి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్న బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో ఫినాలేలో అంతే మొత్తంలో ట్విస్టులతో బిగ్‌బాస్ అల్లాడించాడు. సిల్వర్ రంగులో డైమండ్ సూట్‌కేసుతో టాప్ 4 కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేస్తే.. ఫినాలేలో విన్నర్, రన్నర్‌ను డిసైడ్ చేసే ముందు.. గోల్డెన్ సూట్ కేసును అఖిల్ సార్థక్, బిందు మాధవి ముందు ఉంచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అరియానా గ్లోరి మంచి నిర్ణయం
సిల్వర్ సూట్‌కేసుతో అరియానా తగిన నిర్ణయం తీసుకొన్నది. ఆ సూట్ కేసులో 10 లక్షలు తీసుకొని తెలివైన నిర్ణయం తీసుకొన్నది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అరియానా గ్లోరి బయటకు వెళ్లేది. టాప్ 4 కంటెస్టెంట్‌గా అరియానా ఎలిమినేట్ అయ్యేది. కానీ అరియానా మంచి నిర్ణయం తీసుకొని ఇంటి నుంచి వచ్చింది అని అఖిల్, బిందు మాధవికి ముచ్చట్లు పెట్టారు.

విజేత ప్రైజ్ మనీలో సగం
అయితే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో విన్నర్ ట్రోఫి ఒక్కటే. విన్నర్ ఒకరే. కానీ ఇద్దరు కంటెస్టెంట్లు పోటీలో ఉన్నారు. అయితే బిగ్‌బాస్ విన్నర్‌కు ఇచ్చే మొత్తంలో కొంత భాగం ఈ సూట్ కేసులో ఉంది. ఎవరైనా ఆ మొత్తాన్ని తీసుకొని రన్నర్‌గా గేమ్ నుంచి నిష్క్రమించ వచ్చు అని ఇద్దరికి గాలం వేశాడు. ఒక నిమిషం టైమ్ ఇస్తున్నాను అని చెప్పాడు. అయితే అఖిల్, బిందు మాధవి సూట్ కేసు తీసుకోవడానికి నిరాకరించారు.

గోల్టెన్ సూట్ కేసుతో డ్రామా
అయితే ఇద్దరు కంటెస్టెంట్లు గోల్డెన్ సూట్ కేసు తీసుకోవడానికి నిరాకరించడంతో విజేతకు లభించే మొత్తం విన్నర్‌కే చెందుతుంది. కాబట్టి ఈ సూట్ కేసును వేదికపైకి తీసుకెళ్తానని చెప్పాడు. దాంతో అదే కరెక్ట్ అని అఖిల్, బిందు మాధవి అంగీకరించారు.

నాగ్ జర్నీని ఎమోషనల్‌గా
అయితే అఖిల్ సార్థక్, బిందు మాధవితో ముచ్చట్లు పెడుతుండగా.. బిగ్‌బాస్ ఒక ప్రకటన చేశారు. నాగార్జునకు సంబంధించిన అడియో విజువల్ వీడియోను ప్రదర్శించాడు. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ జర్నీని ఎమోషనల్‌గా చూపించాడు. దాంతో నాగ్‌తోపాటు బిందు, అఖిల్ ఎమోషనల్ అయ్యారు.

శివ బాగా నచ్చాడు అంటూ
ఇంటిలో మిమ్మల్ని ఎవరు ఇన్స్‌పైర్ చేశారని అఖిల్, బిందును అడిగితే.. తనను తేజస్వి మదివాడ ఇన్‌స్పైర్ చేసింది. ఆమె ఒక వ్యక్తి గురించి చాలా పరిణతితో ఆలోచిస్తుందని అఖిల్ చెప్పాడు. ఆ తర్వాత బిందు మాధవి మాట్లాడుతూ.. తనకు శివ బాగా నచ్చాడు. తనకు శివ చాలా స్పూర్తిని ఇచ్చాడు అని చెప్పింది. అనంతరం ఇంటి నుంచి అఖిల్, బిందు తారాజువ్వలా కాంతిలో బయటకు వచ్చారు. బిగ్‌బాస్ వేసిన గోల్డెన్ సూట్ కేసు గాలానికి ఎవరు పడకపోవడంతో వేదికపై విజేత అనౌన్స్‌మెంట్ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











