OTT: 300 కోట్ల అమరన్ ఓటిటి ట్విస్ట్.. రిలీజ్ ప్లానింగ్ డీటెయిల్స్ ఇవే..

ఈ ఒక్క ఏడాదిలో మాత్రం సౌత్ సినిమా దగ్గర ఒకింతవరకు చాలా డ్రై వాతావరణం ట్రెండ్ నడిచింది అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు మరియు తమిళ సినిమా దగ్గర అయితే ఒక్క జనవరి నెల మినహా మిగతా చాలా నెలలు మొత్తం డ్రై గానే ఉంది. దీనితో రీ రిలీజ్ లు చిన్నా చితకా సినిమాలు మాత్రమే రావాల్సి వచ్చాయి. లాగే వాటితో ఆడియెన్స్ కూడ పెద్దగా థియేటర్స్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.

కాగా ఈ సమయంలో కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేశాయని చెప్పొచ్చు. కాగా అలా తమిళ్ సినిమాలో విలక్షణ నటుడు నటించిన సాలిడ్ రివెంజ్ థ్రిల్లర్ మహారాజ మొదలు కొని తమిళ సినిమా షైన్ అవ్వడం మొదలైంది. కాగా ఈ సినిమా తర్వాత చాలా చిన్న సినిమాలు బాగానే రన్ అయ్యాయి. కానీ వీటి అన్నిటి తర్వాత విజయ్ దళపతి నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం వచ్చింది.

twist on blockbuster amaran ott release with its biggest box office success

ఇది కూడా తన రేంజ్ హిట్ అనిపించుకోలేదు. ఒక్క సాలిడ్ హిట్ పడాలి అనే సమయంలో వచ్చిన ఆ ఒక్క సినిమానే "అమరన్". తమిళ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు పెరియసామి తెరకెక్కించిన ఈ బయోపిక్ సినిమా దీపావళి కానుకగా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఎంతలా అంటే దీని దెబ్బకి అనుకున్న ఓటిటి డేట్ ని కూడా మార్చుకోవాల్సి వచ్చిందట.

ఈ మధ్య కాలంలో పలు సినిమాలు నెల తిరక్కుండానే ఓటిటిలలో దర్శనం ఇస్తున్నాయి. కాగా ఈ కోవలోనే అమరన్ కూడా నెల రోజుల లోనే వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అంతెందుకు తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్, థలా అజిత్ లాంటి హీరోలు సినిమాలు కూడా అందుకోని రేంజ్ రన్ ని కొనసాగిస్తుంది.

ఈ మధ్యలోనే వచ్చిన రజనీకాంత్ వెట్టయాన్ సినిమా 200 కోట్ల గ్రాస్ కి కూడా స్ట్రగుల్ అయితే అమరన్ తో శివ కార్తికేయన్ ఏకంగా 250 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టి బిగ్స్ స్టార్స్ కి సైతం ఊహించని పోటీ ఇచ్చాడు. దీనితో అమరన్ బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పుడప్పుడే ఆగేలా కూడా కనిపించడం లేదట. అందుకే ఇపుడు ఓటిటి రిలీజ్ అంత తొందరగా కాబోవడం లేదు అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

twist on blockbuster amaran ott release with its biggest box office success

అన్నట్టు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందులో ఈ నెల లోపే వచ్చేయాల్సిన సినిమా తమిళ్ సహా తెలుగు ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా కొనసాగిస్తున్న రన్ తో ఓటిటి విడుదల ఆపేసారట. కాగా మరో వారం వెనక్కి అమరన్ ఓటిటి ఎంట్రీ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇపుడు ఉన్న ట్రెండ్ లో సినిమా ఈజీగా 300 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేస్తుంది అని ట్రేడ్ చెబుతుంది.

ఇప్పటికే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలని ఈ చిత్రం అందించి పెట్టింది. ఈ దెబ్బతో వారి జీవితాలు సహా శివ కార్తికేయన్ స్టార్డం కూడా భారీగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని అమరవీరుడు ముకుంద వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా శివ కార్తికేయన్ ఆ పాత్రలో ఇమిడిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X