OTT: ఓటిటిలో ముందే వచ్చేసిన త్రిష తొలి వెబ్ సిరీస్.. ఈ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే?
ప్రస్తుతం ఓటిటి ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. మెయిన్ గా కోవిడ్ తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి వీక్షకులు విపరీతంగా పెరిగిపోగా ఒక స్టేజిలో థియేటర్స్ మార్కెట్ కి గట్టి పోటీ ఇచ్చే మాధ్యమాలుగా ఓటిటి ఇండస్ట్రీలు మారిపోయాయి. దీనితో సినిమాలు, వెబ్ సిరీస్ లాంటివి చేసేవారికి ఓటిటి ప్లాట్ అనేది ఒక సువర్ణ అవకాశాన్ని అందించగా చాలా మంది యువ టెక్నీషియన్స్ సినిమాల్లోకి వెళ్లే ముందు ఈ ఓటిటి లలోనే తమ సత్తా చూపించి బిగ్ స్క్రీన్స్ వైపు వెళుతున్నారు.
కాగా ఇపుడు సినిమాలో చాలా వరకు తారలు కూడా ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. రీచ్ ఎక్కువ ఉంటుంది అనో లేక ఫేడ్ అవుట్ అవుతున్న కొందరు సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటిటిలో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అవుతున్నారు. కాగా వీరిలో చాలా మంది స్టార్ హీరోలు హీరోయిన్స్ కూడా ఉండగా మన సౌత్ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు చేయడం స్టార్ట్ చేశారు.

సమంత, తమన్నా లాంటి టైర్ 1 హీరోయిన్స్ ఆల్రెడీ పలు పాన్ ఇండియా వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి రీచ్ ని సొంతం చేసుకున్నారు. దీనితో ప్రస్తుతం ప్రతిరోజు ఓటిటి కంటెంట్ తో వైరల్ గా వినిపిస్తుండగా సౌత్ కి చెందిన మరో స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈమె నటించిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ "బృంద" కూడా మన తెలుగు నుంచే కావడం విశేషం.
తెలుగు దర్శకుడు వంగల సూర్య మనోజ్ ఈ సిరీస్ ని తెరకెక్కించగా ఈ సిరీస్ లో త్రిష ఒక పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. ఇలా తన మొదటి సిరీస్ ని ఒక పోలీస్ థ్రిల్లర్ గా ఆమె ఎంచుకుంది. అయితే ఈ సిరీస్ ఎప్పుడో 2021 లో అనౌన్స్ చేసినప్పటికీ దాదాపు మూడేళ్లు నిరీక్షణ తర్వాత ఓటిటిలో రిలీజ్ కి వచ్చింది. కాగా ఈ సిరీస్ ని మేకర్స్ మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసి రేపు ఆగస్ట్ 2 కి షెడ్యూల్ చేశారు. కానీ అనూహ్యంగా సిరీస్ ఇప్పుడే ఆగష్టు 1 అర్ధ రాత్రికి ముందే అందుబాటులోకి వచ్చేసి ట్విస్ట్ ఇచ్చింది.
కాగా ఈ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అన్నట్టు ఈ సిరీస్ ని ఎందులో చూడొచ్చు అంటే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అనుకునేవారు కాస్త ముందే చూసేయవచ్చు అని చెప్పాలి. కాగా ఈ సిరీస్ "బృంద" లో ఆమని, జయప్రకాష్, రాకేందు మౌళి, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. కాగా ఇపుడు త్రిష తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన భారీ చిత్రం "విశ్వంభర" లో నటిస్తుంది. అలాగే ఈ సినిమా సహా సౌత్ లో మరిన్ని సినిమాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications











