బిగ్ ట్విస్ట్ తో "సంక్రాంతికి వస్తున్నాం" ఓటిటి ఎంట్రీ ఎంట్రీ.. ఎప్పుడంటే

తెలుగు సినిమా నుంచి ఈ ఏడాది పలకరించిన సినిమాల్లో ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ ఆల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చేసింది. మరి ఈ సంక్రాంతి కానుకగా మన స్టార్స్ నుంచి మొత్తం మూడు సినిమాలు వస్తే ఈ చిత్రాల్లో మన సీనియర్ హీరోలు సత్తా చాటారు. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నాటికిఞ్హిన డాకు మహారాజ్ తన కెరీర్లో హైయెస్ట్ వసూళ్లతో హిట్ అయితే తన తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ మామ కెరీర్లోనే కాకుండా తెలుగులో రీజనల్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకోగా రీజనల్ గా ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేసి పారేసింది. కాగా ఇప్పుడుకి కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో అలరిస్తూ వస్తున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ప్రస్తుతానికి ఎలాంటి ఉలుకు లేదు. కాగా దీనితో వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఆల్రెడీ గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

twits on sankranthiki vastunam ott release this when it will come

ఇక డాకు మహారాజ్ కూడా నెల లోపే రావడానికి సిద్ధంగా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఇలా లేదని తెలుస్తుంది. కాగా సంక్రాంతికి వస్తున్నాం పై బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఈ ఫిబ్రవరిలో కూడా రాదని తెలుస్తుంది. అన్నట్టు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకున్నట్టు కూడా చాలా మందికి తెలియదు.

కాగా ఈ జీ5 లో సంక్రాంతికి వస్తున్నాం రాదట. ప్రస్తుతం ఉన్న రూమర్స్ ప్రకారం ఏకంగా మార్చ్ కి ఈ సినిమా షిఫ్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా మార్చ్ మధ్యలో అలా ఈ సెన్సేషనల్ హిట్ సినిమా వస్తుంది అని ప్రెజెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సో దీనిపై ఒక అధికారిక క్లారిటీ వస్తే కానీ దీనిపై ఏది తేలదు. సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో దిల్ రాజు కూడా అప్పుడే ఓటిటిలో వదలాలి అనుకోవడం లేదట.

twits on sankranthiki vastunam ott release this when it will come

అలాగే లాస్ట్ టైం జీ5 లోనే "హను మాన్" సినిమా కూడా సుమారు రెండు నెలల తర్వాతే వచ్చింది. సో ఇపుడు కూడా ఈ తరహాలోనే మళ్ళీ లేట్ గానే సినిమా రావచ్చని చెప్పవచ్చు. ఇక ఈ సూపర్ హిట్ సినిమాని వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించగా ఇద్దరు బ్యూటీస్ ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా దిల్ రాజుకి కీలక పరిస్థితుల్లో ఒక సేవియర్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X